Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మూడు నగరాల్లో భారీ స్థాయి కుటుంబ వినోద కేంద్రాలు... యనమల

విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలలో భారీ స్థాయి కుటుంబ వినోద కేంద్రాల(ఎఫ్ఈసీ-ఫ్యామిలీ ఎంటర్ టెయిన్ మెంట్ సెంటర్ల) ఏర్పాటును పర్యాటక శాఖ అధికారులు ప్రతిపాధించారు. సచివాలయం 2వ బ్లాక్ మొదటి అంతస్తులోని ఆర్థిక శాఖ సమావేశమందిరంలో బుధవారం ఉదయం ఆర్థిక మంత్రి య

Advertiesment
మూడు నగరాల్లో భారీ స్థాయి కుటుంబ వినోద కేంద్రాలు... యనమల
, బుధవారం, 31 జనవరి 2018 (22:19 IST)
విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలలో భారీ స్థాయి కుటుంబ వినోద కేంద్రాల(ఎఫ్ఈసీ-ఫ్యామిలీ ఎంటర్ టెయిన్ మెంట్ సెంటర్ల) ఏర్పాటును పర్యాటక శాఖ అధికారులు ప్రతిపాధించారు. సచివాలయం 2వ బ్లాక్ మొదటి అంతస్తులోని  ఆర్థిక శాఖ సమావేశమందిరంలో బుధవారం ఉదయం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన పట్టనాభివృద్ధి విధానాల సంస్కరణపై మంత్రి మండలి ఉప సంఘం సమావేశం, పర్యాటక శాఖ అభివృద్ధిపై సమీక్షా సమావేశం జరిగాయి. 
 
ఈ సందర్భంగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలలో ప్రతిపాదించిన మూడు ఎఫ్ఈసీలు, కాకినాడలో రిసార్ట్, ప్రకాశం జిల్లా చీరాలలోని ఓడరేవు సమీపంలో రిసార్ట్ గురించి  పర్యాటక  శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా వివరించారు. విశాఖ ఎఫ్ఈసీలో ఒక ఐమాక్స్ థియేటర్, 8 వెండితెరల మల్టీప్లెక్స్, రెండు వేల సీట్ల సామర్ధ్యం గల ఒక కాన్ఫరెన్స్ హాల్(ఎంఐసీఈ-మీటింగ్,ఇన్ సెంటివ్స్, కన్వెన్షన్స్, ఈవెంట్స్), 50వేల అడుగుల వాణిజ్య స్థలం, త్రీస్టార్ హోటల్ ఉంటాయని తెలిపారు. 
 
విజయవాడలోని ఎఫ్ఈసీలో ఒక ఐమాక్స్ థియేటర్, 8 వెండితెరల మల్టీప్లెక్స్, రెండు వేల సీట్ల సామర్ధ్యం గల ఎంఐసీఈ, 50వేల అడుగుల వాణిజ్య స్థలం, త్రీస్టార్ హోటల్, తిరుపతిలోని ఎఫ్ఈసీలో ఒక ఐమాక్స్ థియేటర్, 6 వెండితెరల మల్టీప్లెక్స్, రెండు వేల సీట్ల సామర్ధ్యం గల ఎంఐసీఈ, 80వేల అడుగుల వాణిజ్య స్థలం, త్రీస్టార్ హోటల్  ఉంటాయని వివరించారు. కాకినాడలో మొత్తం పది ఎకరాల స్థలంలో ఓ రిసార్ట్ ఏర్పాటు చేసి, అక్కడ వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారి తెలిపారు. ఈ మొత్తం ప్రాజెక్టులకు వంద నుంచి 150 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. పర్యాటక శాఖకు సంబంధించి మూడు కేటగిరీలుగా విభజించిన 9 అంశాలను  పర్యాటక శాఖ కమిషనర్ హిమాన్షు శుక్లా వివరించారు.
 
ఈ సందర్భంగా మంత్రి యనమల మాట్లాడుతూ ఏ ప్రాజెక్టులైనా నిర్ణయించిన సమయానికి పూర్తికాకపోతే వారికి ఇచ్చిన భూములను తప్పనిసరిగా వెనక్కు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో ఏవైనా ప్రాజెక్టులు గిరిజనేతరులు చేపట్టడానికి నిబంధనలు అనుమతించనందువల్ల ప్రభుత్వం ఆధ్వర్యంలో సొసైటీలు ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించమని అధికారులకు చెప్పారు. ఏపీ టూరిజం బోర్డు ఏర్పాటు, మహేంద్ర సంస్థకు శ్రీకాకుళంలో స్థలం కేటాయింపు, తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో పర్యాటక ప్రాజెక్ట్, అక్కడి ఐల్యాండ్, పలు పర్యాటక ప్రాజెక్టులు, ఏపీటీడీసీ ప్రాజెక్టులు, అరవసల్లి, కుప్పం, తోటకొండ, ఎర్రకాలు భూముల కేటాయింపు తదితర పలు అంశాలను చర్చించారు.  ఈ సమావేశాల్లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు, కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయన, పర్యాటక శాఖ మంత్రి భూమన అఖిలప్రియ, మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కె.కరికాల వళవన్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, గృహ నిర్మాణ శాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి కాంతిలాల్ దండే తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ సచివాలయంలో జర్మనీ స్మార్ట్ సైకిళ్లు, బైకులు