Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రం వీడి పారిపోయిన రవి ప్రకాష్.. సుప్రీంలో ముందస్తు బెయిల్ పిటిషన్

Webdunia
మంగళవారం, 28 మే 2019 (16:31 IST)
ఫోర్జరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ 9 మాజీ సీఈవో రాష్ట్రంవీడి వెళ్లిపోయినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఆయన కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అదేసమయంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. తాజాగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 
 
టీవీ - 9 సంస్థ వాటాల కొనుగోలు విషయంలో ఫోర్జరీ, డేటా చౌర్యానికి పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆయన తమ కార్యాలయానికి హాజరై వివరణ ఇవ్వాలని హైదరాబాద్ సైబర్ నేర పోలీసు విభాగం నోటీసులు జారీచేసింది. ఇప్పటికే మూడుసార్లు నోటీసులు జారీచేసినా ఆయన మాత్రం పోలీసుల ఎదుట రాలేదు. 
 
ఈ పరిస్థితుల్లో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైదారాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయంచాడు. ఇక్కడ కూడా ఆయనకు చుక్కెదురైతే నపంలో రవి ప్రకాశ్‌ను పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్డ్జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

నటుడు సోనూసూద్ కు సంకల్ప్ కిరణ్ పురస్కారం

ప్రముఖ సినీ గేయరచయిత కులశేఖర్ ఇకలేరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments