ఇటీవల వెల్లడైన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కారు స్పీడుకు బ్రేకుల్లాంటివని తెరాస వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ తాజా ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ స్పందిస్తూ, లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ కొన్ని సీట్లు కోల్పోయినప్పటికీ ఓట్ల శాతం మాత్రం పెరిగిందన్నారు. గతంలో కంటే ఆరు శాతం పెరిగాయని కేటీఆర్ వివరించారు.
ఈ ఎన్నికల ఫలితాలు తమ స్పీడుకు బ్రేకుల్లాంటివన్నారు. అదేసమయంలో పలు ప్రాంతాల్లో ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభ్యర్థుల గెలుపొందడంపై కూడా ఆయన స్పందించారు. మల్కాజ్‌గిరిలో వెంట్రుకవాసిలో విజయం కోల్పోయామన్నారు. నిజామాబాద్‌లో బీజేపీ - కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యానీ, పైగా, ఇక్కడ నామినేషన్లు దాఖలు చేసిని రైతులు కాదనీ, అందరూ నేతలేనని చెప్పారు. కవిత ఇక్కడ ఇకపోతే రేవంత్ రెడ్డి గెలుపు ఒక గెలుపేకాదన్నారు. దేశంలో నరేంద్ర మోడీ హవా వున్నప్పటికీ తెలంగాణాలో మాత్రం కారు దూసుకెళ్లిందన్నారు. ఆదిలాబాద్‌లో బీజేపీ గెలుస్తుందని తాము ఊహించలేక పోయామన్నారు. కానీ, ఈ ఎన్నికల ఫలితాల్లో విచిత్రమైన ట్రెండ్ కొనసాగిందని చెప్పుకొచ్చారు.
కరీంనగర్ జిల్లాలో బీజేపీ అభ్యర్థి గెలుపుపై ఆయన స్పందిస్తూ, సిరిసిల్లలో బీజేపీకి కార్యకర్తలు కూడా లేరు. అసెంబ్లీ ఎన్నికలకంటే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఈ ఫలితాలతో టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళన చెందొద్దు. వరంగల్‌లో టీఆర్‌ఎస్ పార్టీకి వచ్చిన మెజారిటీ మిగతా చోట్ల బీజేపీ, కాంగ్రెస్ గెలిచిన అభ్యర్థులకంటే ఎక్కువ వచ్చింది. పైగా, తాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఫెయిల్ కాలేదు. కవిత డాటర్ ఆఫ్ ఫైటర్ కేసీఆర్ కుమార్తె అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.