Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫలితాలు కారు స్పీడుకు బ్రేకులే .. నేను ఫెయిల్ కాలేదు: కేటీఆర్

Webdunia
మంగళవారం, 28 మే 2019 (16:13 IST)
ఇటీవల వెల్లడైన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కారు స్పీడుకు బ్రేకుల్లాంటివని తెరాస వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ తాజా ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ స్పందిస్తూ, లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ కొన్ని సీట్లు కోల్పోయినప్పటికీ ఓట్ల శాతం మాత్రం పెరిగిందన్నారు. గతంలో కంటే ఆరు శాతం పెరిగాయని కేటీఆర్ వివరించారు. 
 
ఈ ఎన్నికల ఫలితాలు తమ స్పీడుకు బ్రేకుల్లాంటివన్నారు. అదేసమయంలో పలు ప్రాంతాల్లో ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభ్యర్థుల గెలుపొందడంపై కూడా ఆయన స్పందించారు. మల్కాజ్‌గిరిలో వెంట్రుకవాసిలో విజయం కోల్పోయామన్నారు. నిజామాబాద్‌లో బీజేపీ - కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యానీ, పైగా, ఇక్కడ నామినేషన్లు దాఖలు చేసిని రైతులు కాదనీ, అందరూ నేతలేనని చెప్పారు. కవిత ఇక్కడ ఇకపోతే రేవంత్ రెడ్డి గెలుపు ఒక గెలుపేకాదన్నారు. దేశంలో నరేంద్ర మోడీ హవా వున్నప్పటికీ తెలంగాణాలో మాత్రం కారు దూసుకెళ్లిందన్నారు. ఆదిలాబాద్‌లో బీజేపీ గెలుస్తుందని తాము ఊహించలేక పోయామన్నారు. కానీ, ఈ ఎన్నికల ఫలితాల్లో విచిత్రమైన ట్రెండ్‌ కొనసాగిందని చెప్పుకొచ్చారు. 
 
కరీంనగర్ జిల్లాలో బీజేపీ అభ్యర్థి గెలుపుపై ఆయన స్పందిస్తూ, సిరిసిల్లలో బీజేపీకి కార్యకర్తలు కూడా లేరు. అసెంబ్లీ ఎన్నికలకంటే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఈ ఫలితాలతో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆందోళన చెందొద్దు. వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీకి వచ్చిన మెజారిటీ మిగతా చోట్ల బీజేపీ, కాంగ్రెస్‌ గెలిచిన అభ్యర్థులకంటే ఎక్కువ వచ్చింది. పైగా, తాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఫెయిల్ కాలేదు. కవిత డాటర్ ఆఫ్ ఫైటర్ కేసీఆర్ కుమార్తె అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

Ravi Teja: మాస్ జాతర కోసం సబ్ ఇన్ స్పెక్టర్ లక్మణ్ భేరి ఏం చేశాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments