Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీటీడికి పాత నోట్ల తలనొప్పి.. నాలుగేళ్లైనా పట్టించుకోని కేంద్రం

Webdunia
గురువారం, 24 జూన్ 2021 (14:50 IST)
పాత ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లు రద్దు కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్తగా ఈ పాత నోట్ల తలనొప్పి తయారైంది. టీటీడీ వద్ద పాత నోట్లు గుట్టలుగా పడి ఉన్నాయి. వాటిని ఏంచేయాలతో అర్థంకాని పరిస్థితిలో ఉంది టీటీడీ. 
 
ఈ క్రమంలో టీటీడీ వద్ద నిల్వ ఉన్న రద్దు చేసిన పాతనోట్లు మొత్తం రూ.49.70 కోట్ల విలువైన 1.8లక్షల రూ.వెయ్యి, 6.34 లక్షల రూ.500 పాత నోట్లు ఉన్నాయి. వీటిని ఏంచేయాలో అనే ఆలోచనలు పడింది టీటీడీ. దీనికి సంబంధించి గతంలో టీటీడీ పూర్వ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నాలుగుసార్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. టీటీడీ వద్ద ఉన్న పాత నోట్లను ఏంచేయాలి? సమాధానం చెప్పాలంటూ పలుమార్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వు బ్యాంకుకు లేఖలు రాశారు. కానీ ఫలితం లేదు. వారి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు.
 
దీంతో భక్తులు మొక్కులుగా శ్రీవారికి సమర్పించిన పాతనోట్లను ఏం చేయాలో తెలీక టీటీడి అయోమయంలో పడిపోయింది. దీనికి సంబంధించి టీటీడీ బోర్డు ఇటీవల జరిగిన సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావించారు. కేంద్రం ఈ విషయంలో స్పష్టత ఇవ్వటంలేదనీ..కానీ వీటిని ఎక్కువగా నిల్వ ఉంచుకోలేమని మీడియాకు తెలిపారు. 
 
కేంద్ర ప్రభుత్వం పాతనోట్లు రద్దు చేసి ఇప్పటికే నాలుగున్నర సంవత్సరాలు అవుతోంది. ఇన్నాళ్లయిన టీటీడీ విన్నపాలను పట్టించుకోలేదు కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలో ఈ పాత నోట్లను ఏంచేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పడింది టీటీడీ పాలక మండలి. మరి కేంద్రం ఎప్పటికీ స్పందించకపోతే టీటీడీ వ‌ద్ద ఉన్న రూ.49.70కోట్ల పాత‌నోట్ల‌ను నిర్వీర్యం చేయానుందా?.. మరి ఈ నోట్ల గురించి టీటీడీ ఏం చేయనుందో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments