Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాపం ఆవేదనతో సిఎం చిన్నాన్న.. మళ్ళీ?

పాపం ఆవేదనతో సిఎం చిన్నాన్న.. మళ్ళీ?
, శనివారం, 19 జూన్ 2021 (22:12 IST)
టిటిడి పాలకమండలి ఛైర్మన్‌గా రెండేళ్ళ పదవీ కాలం పూర్తయ్యింది వై.వి.సుబ్బారెడ్డి పాలకమండలికి. ఈ నెల 21వ తేదీకి ఈ పదవీకాలం ముగియనుంది. ఈ రోజు చివరి పాలకమండలి సమావేశం తిరుమలలో జరిగింది. చివరి పాలకమండలి సమావేశం కావడంతో సభ్యులందరూ హాజరయ్యారు. 
 
చివరి పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులకు అవగాహన కల్పించి టిటిడి ద్వారా రైతుల వద్ద పంటలు పండిస్తామన్నారు టిటిడి ఛైర్మన్. త్వరలో ఎస్వీబీసీ ఛానల్‌ను కన్నడ, హిందీ భాషల్లో ప్రారంభిస్తామన్నారు.
 
శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా కొన్ని దేవాలయాలను పుననిర్మిస్తామన్నారు. దేశ వ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్‌లో భాగంగా కాశ్మీర్లో ఆలయ నిర్మాణం చేపట్టామని.. త్వరలోనే ఆలయం పూర్తి చేసి భక్తులకు అందుబాటులో ఉంచుతామన్నారు. అలాగే గుడికి గోమాత కార్యక్రమంను టిటిడి పాలకమండలి నిర్ణయంతో వంద ఆలయాలకు గోవులను అందించామన్నారు. 
 
గత రెండు సంవత్సరాల నుంచి భక్తులకు మెరుగైన సేవలు అందించే కార్యక్రమం చేశామని.. విఐపి బ్రేక్ దర్సనాల్లో ఎల్1, ఎల్2 విధానాన్ని రద్దు చేశామన్నారు. అంతేకాకుండా బేడీ ఆంజనేయస్వామి ఆలయం చుట్టూ ఉన్న దుకాణాలను తొలగిస్తామన్నారు. హనుమాన్ జన్మస్థలం తిరుమలగానే భావిద్దామని స్పష్టం చేశారు.
 
భక్తుల కష్టాలను తీర్చే గరుడ వారధిని అలిపిరి వరకు పొడిగిస్తామన్నారు. అలాగే తిరుమల-తిరుపతి మధ్య 100 ఆర్టీసీ బస్సులు తిరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. 100 బస్సులు ప్రారంభం కాగానే పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ఆర్టీసీని కోరుతామన్నారు. కొండపై ఉన్న టాక్సీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌లో మనందరి ఇల్లు, తినడానికి తిండి, అన్ని సౌకర్యాలు ఫ్రీ