Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మ‌ళ్ళీ ఐఎఎస్‌ల బ‌దిలీలు

Webdunia
శనివారం, 24 జులై 2021 (19:28 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇటీవల త‌ర‌చూ ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్. అధికారుల‌ను బ‌దిలీ చేస్తోంది. తాజాగా మ‌ళ్ళీ ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌లు చేశారు. వైద్యశాఖ ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీగా తూ.గో. కలెక్టర్ మురళీధర్‌రెడ్డి బదిలీ అయ్యారు. కడప జిల్లా కలెక్టర్‌గా విజయరామరాజు, తూ.గో. జిల్లా కలెక్టర్‌గా సీహెచ్‌. హరికిరణ్‌ బదిలీ అయ్యారు.

ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోగా వినయ్‌చంద్‌, విశాఖ జిల్లా కలెక్టర్‌గా ఎ.మల్లికార్జున, కమిషనర్‌ ఆర్‌అండ్ఆర్‌గా హరిజవహర్‌లాల్‌ బదిలీ అయ్యారు. విజయనగరం జిల్లా కలెక్టర్‌గా ఎ.సూర్యకుమారికి పోస్టింగ్ ఇచ్చారు. అలాగే, పౌర సరఫరాల శాఖ వీసీ, ఎండీగా జి.వీరపాండియన్‌, కర్నూలు జిల్లా కలెక్టర్‌గా పి.కోటేశ్వరరావుకు పోస్టింగ్ ఇచ్చారు.

వీఎంఆర్‌డీఏ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌గా కె.వెంకటరమణారెడ్డి, పశ్చిమ గోదావ‌రి జిల్లా జేసీగా సుమిత్‌కుమార్‌ బదిలీ అయ్యారు. శ్రీకాకుళం జేసీగా బి.ఆర్‌.అంబేడ్కర్‌ బదిలీ అయ్యారు. చేనేత శాఖ సంచాలకుడిగా పి.అర్జున్‌రావు నియ‌మితుల‌య్యారు. దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్‌కు కమిషనర్‌గా  అదనపు బాధ్యతలు ఇచ్చారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments