24 గంటల్లో ఏపీలో నమోదైన పాజిటివ్ కేసులెన్ని?

Webdunia
శనివారం, 24 జులై 2021 (19:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2714 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 74,820 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఈ  కేసులు వెలుగు చూశాయి. 
 
వీటిలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 418 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 329, కృష్ణా జిల్లాలో 248, నెల్లూరు జిల్లాలో 246, ప్రకాశం జిల్లాలో 233, పశ్చిమ గోదావరి జిల్లాలో 209 కేసులు వెల్లడయ్యాయి. కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 
అలాగే, 2,737 మంది కరోనా నుంచి కోలుకోగా, 18 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 13,241కి పెరిగింది. కాగా, ఏపీలో ఇప్పటివరకు 19,52,513 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 19,16,914 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagababu: నా స్మృతివనం శంకుస్థాపన చేయి అంటూ భావోద్వేగానికి గురయిన నాగబాబు

manchu manoj: డేవిడ్ రెడ్డి కాదు రాక్షస రెడ్డి అన్న బ్రిటీషర్స్ ఎందుకంటే...

Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ స్టైలిష్ థ్రిల్లింగ్ మూవీగా ఐ యామ్ గేమ్

Mega brothers: మెగా బ్రదర్స్ కలయికగా చిరంజీవి మెగా158 సినిమా ప్రారంభోత్సవం

'మెగా 158' ప్రారంభం... అన్న సినిమాకు క్లాప్ కొట్టిన తమ్ముడు

తర్వాతి కథనం
Show comments