Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య వుండగానే రెండో పెళ్లి.. ఆపై వేధింపులు.. హత్యాయత్నం.. చివరికి?

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (20:15 IST)
భార్య వుండగానే రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య వుందనే విషయం చెప్పకుండానే రెండో పెళ్లి చేసుకోవడంతో రెండో భార్య నిలదీసింది. దీంతో ఆ భర్త రెండో భార్యను వేధించడం మొదలెట్టాడు. ఓ దశలో ఆమెను వదిలించుకునేందుకు మేడపై నుంచి తోసి హత్య చేసేందుకు యత్నించాడు. ఆ తర్వాత కనిపించకుండాపోయాడు. ఈ ఘటన తిరుపతి రూరల్ మండలం తుమ్మలకుంటలో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. తిరుపతి రూరల్ మండలం తుమ్మలకుంటకు చెందిన కృష్ణవేణికి ఇద్దరు పిల్లలు. 2012లో భర్తతో విబేధాలు వచ్చి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత పిల్లలతో కలిసి ఎల్ఎస్ నగర్‌లో ఉండేది. అదే బిల్డింగ్‌లో రాజేష్ అనే బ్యాంక్ ఉద్యోగి ఉండేవాడు. కృష్ణవేణి పరిస్థితి తెలుసుకుని పరిచయం పెంచుకున్నాడు. తన భార్య నుంచి విడాకులు తీసుకున్నట్టు నమ్మించాడు. 
 
కృష్ణవేణిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. గత ఏడాది పెళ్లికూడా చేసుకున్నాడు. కొన్ని నెలల కాపురం తర్వాత రాజేష్‌లో అసలు మనిషి బయటపడ్డాడు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే తనను పెళ్లి చేసుకున్నాడని కృష్ణవేణి తెలుసుకుంది.
 
ఇదే విషయమై రాజేష్‌ను నిలదీయడంతో వివాదమైంది. అంతేగాకుండా తనను వదిలించుకునేందుకు రాజేష్ ప్రయత్నించాడని కృష్ణవేణి ఆరోపించింది. నిద్రలో ఉన్న సమయంలో రెండో అంతస్తు నుంచి కిందపడేశాడని తెలిపింది. దీంతో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments