Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారికి రికార్డు స్థాయిలో పెరుగుతున్న వడ్డీ కాసులు.. డిపాజిట్లు ఫుల్

సెల్వి
సోమవారం, 22 ఏప్రియల్ 2024 (17:07 IST)
తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య విపరీతంగా వుంటుంది. ఇంకా శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులు భారీ స్థాయిలో మొక్కుబడుల పేరిట కానుకలు హుండీల్లో వేస్తుంటారు. ఇంకా విరాళాలు ఇస్తుంటారు. వందలాది ఏళ్లుగా ఏడుకొండల స్వామికి కానుకలు, డబ్బు ఇచ్చే భక్తుల సంఖ్య అమాంతం పెరుగుతూ వస్తోంది. 
 
ఈ ఆదాయం అంతా కూడా గుట్టలు గుట్టలుగా పేరుకుపోతోంది. అందుకే ఏడుకొండల స్వామిని వడ్డీ కాసుల వాడు అంటుంటారు. గత కొన్నేళ్లుగా శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది.

ఇంకా వేసవి కావడంతో రోజురోజుకు తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. దీంతో శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఫ్రీ దర్శనం కోసం భక్తులు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండక తప్పడం లేదు. ఈ క్రమంలోనే శ్రీవారి హుండీ ఆదాయం కూడా పెరుగుతూ వస్తోంది.
 
తిరుపతి దేవస్థానం హుండీలో కాసుల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి 2023-24 ఏడాదిలో రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. 2023-24 ఏడాదికి గాను రూ.1,161కోట్లు, 1,031 ​కేజీల బంగారం శ్రీవారి హుండీ ద్వారా వచ్చినట్లు సమాచారం.

దీంతో టీటీడీ బ్యాంక్ డిపాజిట్లు భారీ స్థాయిలో పెరిగింది. మొత్తానికి ప్రస్తుతం ఏటా లభించే వడ్డీ రూ.1,200 కోట్లు దాటిందట. ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా రూ. 1600 కోట్లకు పైగా సంపాదిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments