Webdunia - Bharat's app for daily news and videos

Install App

భక్తులకు శ్రీవారి దర్శనం.. మాస్కులు, భౌతిక దూరంతో అనుమతి..

Webdunia
మంగళవారం, 12 మే 2020 (18:46 IST)
కరోనా వైరస్ నేపథ్యంలో శ్రీవారి దర్శనాన్ని భక్తులు నోచుకోలేకపోయారు. లాక్ డౌన్ కారణంగా శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు తప్పించి భక్తులకు అనుమతి లేదు. ప్రస్తుతం ఈ పరిస్థితి మారబోతోంది. భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం లభించనుంది. త్వరలో భక్తులను అనుమతించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమవుతోంది. కేంద్రం నుంచి వచ్చే ఆదేశాలను బట్టి దర్శనానికి భక్తులను అనుమతించాలనుకుంటోంది. దీనిపై తేదీని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.
 
కరోనా కట్టడి నిర్మూలను మాస్కులు, భౌతిక దూరం పాటించడం వంటి ముఖ్య చర్యలపై ఓ నిర్ణయానికి వచ్చిన టీటీడీ దర్శన విధానంలో మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పరిమిత సంఖ్యలో భక్తులను దర్శనానికి అనుమతి ఇచ్చేందుకు టీటీడీ సిద్ధం అవుతోంది. క్యూ కాంప్లెక్స్‌లో భక్తులు వేచి వుండే విధానానికి తాత్కాలికంగా స్వస్తి పలకనున్నట్లు సమాచారం.
 
టైం స్లాట్ కింద వచ్చిన భక్తులకు వెంటనే శ్రీవారి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేయనుంది. ట్రయిల్ కింద స్థానికులను దర్శనానికి అనుమతించనున్నట్లు తెలుస్తోంది. సక్సెస్ అయితే ఈ విధానం కొనసాగే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments