Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తల మధ్య మనస్పర్థలు_భర్త ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 23 ఫిబ్రవరి 2020 (17:39 IST)
భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా భర్త ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రామకృష్ణ చైతన్య అనే వ్యక్తి వయసు 44 సంవత్సరాలు. ప్రైవేట్ ఒక సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తిరుమలగిరిలోని చంద్రగిరి కాలనీలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు.
 
ఇతనికి రజని వైష్ణవితో ప్రేమ వివాహం జరిగింది.. వీరికి 14 సంవత్సరాల వయస్సుగల కూతురు ఉంది. గత కొద్ది సంవత్సరాలుగా భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నెల 10 వ తేదీన భార్య మ్యూచువల్ డైవోర్సు పంపించడం జరిగిందని పోలీసులు తెలిపారు.
 
కోర్టు ద్వారా దాన్ని తను తీసుకుని సంతకం పెట్టి పంపించడం జరిగింది. దానితో అతను తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఒంటరిగా ఇంట్లో ఉండి, మద్యం సేవించి నిన్నటి అర్ధరాత్రి చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో ఇన్సైడ్ బోల్ట్ పెట్టుకొని సీలింగ్ ఫ్యాన్ కు బెడ్ షీట్ తో ఉరి వేసుకుని చనిపోయాడు.
 
ఉదయం 11 గంటలకు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అపార్ట్మెంట్ వాసులు బలవంతంగా డోరు తెరిచి చూడగా చైతన్య అప్పటికే చనిపోయి ఉన్నాడు.. అతని మేనత్త శ్రీమతి కీత రాధ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం గాంధీ మార్చురీకి  తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments