ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు కూలీలు మృతి, 20 మందికి పైగా గాయాలు

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (14:22 IST)
గుంటూరు జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దర్మరణం చెందగా.. 20 మందికి పైగా కూలీలకు గాయాలయ్యాయి. గుంటూరు జిల్లాలోని వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది.

మంగళవారం కూలీలతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టంది. ఈ ఘటనలో డ్రైవర్‌తోపాటు ఇద్దరు కూలీలు మృతిచెందారు. చాలా మందికి తీవ్రగాయాలయ్యాయి.

మొత్తం మీద ఈ ఘటనలో 20 మందికిపైగా కూలీలకు గాయాలయ్యాయని స్థానికులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
 
కాగా.. బాధిత కూలీలను కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వాసులుగా గుర్తించారు. కర్నూలు నుంచి కూలీ పని కోసం వీరంతా గుంటూరు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది. మృతులు డ్రైవర్‌తోపాటు ఎర్నాల శ్రీనివాసులు, భీమయ్యగా గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments