Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకనైనా ఆ మూర్ఖులు ప్రచారం మానుకుంటే మంచిది: పరిటాల శ్రీరామ్ ఫైర్

Webdunia
సోమవారం, 16 మార్చి 2020 (14:30 IST)
తను తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్లు ప్రచారం చేస్తున్న వారిపై పరిటాల శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా తన స్పందన తెలియజేశారు. ఆయన రాతల్లోనే.. . “తెలుగుదేశం పార్టీలో మాకు ఏదో విభేదాలు ఉన్నాయని పార్టీ మారుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా నాన్న పరిటాల రవీంద్ర గారి సిద్ధాంతాలతో ఆయన ఆశయసాధన కోసం తెలుగుదేశం పార్టీని బలంగా నమ్మి ప్రజా అభివృద్ధి కాంక్షిస్తూ నిత్యం ప్రజాసేవలో కొనసాగుతున్నాం. 
 
అలాంటి మా మీద, కన్నతల్లి లాంటి పార్టీ మారుతున్నట్లు తీవ్రమైన దుష్ప్రచారాన్ని చేస్తున్న మూర్ఖులు.. అందరికీ ఒక్కటి మాత్రం చెప్పగలం. పసువు జెండా వదిలి పక్క పార్టీ వైపు చూసే దురాలోచన మాకు రాదు రాబోదు. తల్లి పాలు తాగి తల్లికే ద్రోహం చేసే సంస్కృతి మాకు లేదన్నారు. తరాలు మారినా తరగని అభిమానంతో పసుపు జెండా కోసం పని చేస్తాం. కార్యకర్తలకు అండగా ఉంటాం. 
 
తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. ఇకనైనా ఇలాంటి రాతలు రాసే వారు నీతి మాలిన రాతలు మాని సమాజంలో నీతిగా బతకండి. మేము పార్టీ మారుతున్నట్లు జరగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు” అని శ్రీరామ్ ఓ ప్రకటనను ఇచ్చారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments