Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడలితో మామ అక్రమ సంబంధం, కొడుకు అడ్డుగా ఉన్నాడని?

Webdunia
సోమవారం, 16 మార్చి 2020 (14:08 IST)
కోడలు అంటే కూతురితో సమానం. తన ఇంటికి వచ్చిన కోడలిని సొంత కూతురితో సమానంగా మామ చూసుకోవాలి. అయితే కోడలిపైనే కన్నేసిన మామ ఆమెను లొంగదీసుకున్నాడు. కొడుక్కి తెలిసి పలుమార్లు హెచ్చరిస్తే వినలేదు. అంతటితో ఆగేలేదు తన కుమారుడు తన బంధానికి అడ్డుగా ఉన్నాడని చంపేందుకు ప్లాన్ వేశాడు.
 
పంజాబ్ లోని ఫరీదాకోట్‌లో కన్వల్ సింగ్ కుమారుడు రాజిందర్ సింగ్ నివాసముంటున్నారు. రెండు నెలల క్రితం జస్వీర్ కైర్‌తో రాజిందర్ సింగ్‌ను ఇచ్చి వివాహం చేశారు. వీరి జీవితం సాఫీగానే సాగిపోతోంది. అయితే కన్వల్ సింగ్ భార్య అనారోగ్యంతో సంవత్సరం క్రితం చనిపోయింది.
 
దీంతో కోరికలు ఆపుకోలేని మామ కోడలిపై కన్నేశాడు. ఆమెకు మాయమాటలు చెప్పాడు. గత 15 రోజుల నుంచి ఆమెతో శారీరక సంబంధాన్ని కొనసాగించాడు. విషయం కాస్తా కుమారుడికి తెలిసింది. తండ్రిని మందలించాడు. తప్పని చెప్పాడు. అయినా ఆయనలో మార్పు రాలేదు. 
 
తన బంధానికి కుమారుడు అడ్డుపడటాన్ని తట్టులేకపోయాడు కన్వల్ సింగ్. ఎలాగైనా చంపేయాలనుకుని నిర్ణయించుకున్నాడు. నిన్న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న రాజిందర్ సింగ్‌ను కత్తితో పొడిచేందుకు ప్రయత్నించాడు. అయితే మెళకువలో ఉన్న రాజిందర్ గట్టిగా కేకలు వేశారు. 
 
దీంతో కన్వల్ సింగ్ అక్కడి నుంచి పారిపోయాడు. తండ్రిపైన పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసిన రాజిందర్ జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments