డాక్టర్ సుధాకర్ పై చర్యలు తీసుకోవడానికి కారణం ఇదే: మంత్రి అవంతి

Webdunia
శనివారం, 23 మే 2020 (22:28 IST)
వైజాగ్ కు చెందిన డాక్టర్ సుధాకర్ పై వైసీపీ ప్రభుత్వానికి ఎలాంటి కక్ష లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విధులను సక్రమంగా నిర్వహించనందువల్లే ఆయనపై చర్యలు తీసుకున్నామని చెప్పారు.

డాక్టర్ అంశాన్ని టీడీపీ అధినేత రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఐదు సంవత్సరాల్లో చేయాల్సిన పనులన్నింటినీ ముఖ్యమంత్రి జగన్ ఏడాది కాలంలోనే పూర్తి చేశారని అన్నారు.

కరోనా సమయంలో సైతం సంక్షేమ పథకాలతో పాటు ఫీజు రీయింబర్స్ మెంట్, డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ, రైతు భరోసా తదితర పథకాలను అమలు చేశారని చెప్పారు.
 
నాయకుడికి కావాల్సింది అనుభవం, వయసు కాదని... జగన్ లాంటి పెద్ద మనసు అని అవంతి అన్నారు. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన ప్రభుత్వానికి ఎదురుదెబ్బ అంటూ ఎల్లో మీడియా ప్రచారం చేస్తోందని విమర్శించారు.

ఎలాంటి దెబ్బనైనా ఎదుర్కోగల శక్తి జగన్ కు ఉందని చెప్పారు. విద్యుత్ ఛార్జీలపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని... బషీర్ బాగ్ ఘటనను జనాలు ఇంకా మర్చిపోలేదని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Netflix నెట్ ఫ్లిక్స్ నిజంగానే స్కిప్ అడల్ట్ సీన్ బటన్‌ను జోడించిందా?

Allu Arjun: అట్లీ సినిమాలో అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నాడా !

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments