Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంగీత ప్రపంచానికి ఇదొక చీకటి రోజు: మెగాస్టార్ చిరంజీవి

Webdunia
శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (22:44 IST)
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణ వార్తతో సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. సినీ ప్రముఖులందరూ తీవ్ర దిగ్బ్రాంతిని  వ్యక్తం చేసారు. మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ గుండె బద్దలైనట్టుగా ఉందని అన్నారు. సంగీత ప్రపంచానికి ఇదొక చీకటి రోజని చెప్పారు.
 
బాలుగారి మరణంతో ఒక శకం ముగిసిపోయిందని అన్నారు. అద్భుతమైన స్వరంతో తను ఎన్నో మధురమైన పాటలను అందించారని, నా విజయంలో ఆయన పాత్ర ఎంతో ఉందని తెలిపారు. ఘంటశాల గారికి వారసుడిగా ఎవరొస్తారని ఎదురుచూస్తున్న తరుణంలో బాలు గారు ధ్రువతారలా దూసుకొచ్చారని చిరంజీవి అన్నారు.
 
తన మధురమైన గానంతో భాష, సంస్కృతిల సరిహద్దులను చెరిపి వేశారని చెప్పారు. దశాబ్దాల పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించారని తెలిపారు. బాలు గారి స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరని తన మరణం ద్వారా ఏర్పడిన శూన్యాన్ని పునర్జన్మ ద్వారా ఆయనే భర్తీ చేస్తారని చెప్పారు. బాలు లేని లోటు తీర్చలేనిదని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరూలని మెగాస్టార్ ప్రార్థించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments