Webdunia - Bharat's app for daily news and videos

Install App

83 యేళ్ళ వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడిన దొంగ... ఎక్కడ?

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (17:57 IST)
దొంగతనాలలో ఆరితేరిన ఓ వ్యక్తికి ఎన్ని సార్లు శిక్ష పడినా బుద్ధిరాలేదు. మళ్లీ మళ్లీ దొంగతనాలకు పాల్పడుతూనే ఉన్నాడు. నగలు డబ్బు దొంగతనం చేయబోతే అడ్డు పడిన వృద్ధురాలిపై అత్యాచారానికి కూడా ఒడిగట్టాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివారలను పరిశీలిస్తే, గేరీ మ్యాలెట్(51) గత 30 ఏళ్లుగా దొంగతనాలకు పాల్పడుతూ పలుమార్లు జైలుకు వెళ్లాడు. 1992లో దొంగతనం కేసులో జైలు శిక్షను అనుభవించి విడుదలైన గేరీ ఆ తర్వాత డ్రగ్స్, ప్రాపర్టీ దొంగతనాల కేసులో జీవితాన్ని మరోమారు కటకటాల వెనుక గడిపాడు. 
 
2014 మే నెలలో మళ్లీ జైలు నుండి విడుదలయ్యాడు. అయినా తన పంధాని మార్చుకోలేదు. వరుసగా నేరాలు చేస్తూనే ఉన్నా పోలీసులకు మాత్రం చిక్కలేదు. పోలీసులు ఎన్నోమార్లు పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఇటీవల ఓ ఇంటికి దొంగతనానికి వెళ్లిన గేరీకి 83 ఏళ్ల వృద్ధురాలు కనిపించింది. 
 
నగలు, డబ్బు ఎక్కడున్నాయని బెదిరించి అడిగాడు. అమె తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో అత్యాచారం చేయబోయాడు. తీవ్రంగా కొట్టి నగలు, డబ్బు దోచుకుని అక్కడ నుండి పరారయ్యాడు. దాడిలో వృద్ధురాలి పక్కటెముకులు విరిగాయని, తలపై కూడా తీవ్రంగా గాయాలయ్యాయని వైద్యులు చెప్పారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గేరీపై ఇప్పటివరకు 11 కేసులు నమోదయ్యాయని పోలీసులు చెప్పారు. గేరీ కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments