వైకాపాకు మాజీ మంత్రి బాలినేని దూరం దూరం...

Webdunia
ఆదివారం, 7 మే 2023 (09:39 IST)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి బాగా దూరమైపోయినట్టు తెలుస్తుంది. తాజాగా ఒంగోలులో ఆయన పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్ ఫోటోలు లేకపోవడం ఇపుడు రాజకీయ వర్గాల్లో పెను చర్చకు దారితీశాయి. ఇటీవల వైకాపా కో ఆర్డినేటర్ పదివి నుంచి తప్పుకున్న బాలినేని.. ఇటీవల ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తనపై పార్టీలోని వారే విమర్శలు చేస్తున్నారంటూ కంటతడి పెట్టుకున్న విషయం తెల్సిదే. ఇపుడు జగన్ ఫ్లెక్సీలో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పేరు కనిపించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 
 
వేసవి నేపథ్యంలో ఒంగోలు నగరపాలక కార్యాలయం, ప్రకాశం భవన్, మార్కెట్ సెంటర్, రిమ్స్ వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. బాలినేని శ్రీనివాస రెడ్డి వీటిని ప్రారంభించాల్సివుంది. కానీ, వివిధ కారణాలతో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదాపడింది. అయితే, ఆయా చలివేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్లీల్లో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్ ఫోటోలు లేకపోవడంతో రాజకీయ చర్చకు తెరలేసింది. ఈ పరిణామాలన్నింటినీ చూస్తే పార్టీతో ఆయనకు దూరం పెరిగినట్టుగా ఉందని చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments