బాలికను లొంగదీసుకుని గర్భవతి చేశాడు, పెద్దల ఒత్తిడితో పెళ్లి చేసుకునీ...

Webdunia
బుధవారం, 10 జూన్ 2020 (18:47 IST)
మైనర్ బాలికను ప్రేమిస్తున్నానంటూ వెంటపడి లొంగదీసుకున్నాడు. గర్భవతిని చేసి ముఖం చాటేశాడు. బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా బుద్ధి మారలేదు. చివరికి పుట్టింటికి చేరిన అమాయకురాలి ఉదంతం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
 
చేబ్రోలు మండలంలోని తోట్లపాలెం గ్రామానికి చెందిన బాలిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ఫస్టియర్ చదువుతోంది. నాగార్జున యూనివర్సిటీలో ఎంటెక్‌ చదువుతున్న గోపి అనే వ్యక్తితో ఆమెకు కొన్నాళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నాను, పెళ్లిచేసుకుంటాను అని లొంగదీసుకున్నాడు.
 
గోపి తాత, ఇతర బంధువులు తోట్లపాలెంలోనే నివసిస్తుండగా తరుచూ వారింటికి వచ్చినట్లుగా వచ్చి బాలికతో శారీరికంగా కలిసేవాడు. మార్చి నెలలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్న సమయంలో బాలిక అనారోగ్యానికి గురైంది. వైద్య పరీక్షలు చేయించగా గర్భవతి అని తేలింది. బాలిక తల్లిదండ్రులు గోపి కుటుంబాన్ని సంప్రదించగా పెళ్లికి నిరాకరించారు. పోలీసులను ఆశ్రయించి గోపీతో పెళ్లి జరిగేలా చేసారు.
 
అత్తారింటికి వెళ్లిన బాలికకు వేధింపులు తప్పలేదు. చిత్రహింసలు పెట్టారు, బయటకి తెలియనివ్వకుండా డాక్టర్ వద్దకు తీసుకెళ్లి అబార్షన్ చేయించారు, గదిలో పెట్టి పస్తులు ఉంచారు. బాధితురాలి కుటుంబ సభ్యులకు విషయం తెలియడంతో పోలీసుల సహాయంతో బాలికను ఇంటికి తీసుకువచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం