Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మదురై బాలికకు అరుదైన గౌరవం.. పేదలకు గుడ్ విల్ అంబాసిడర్‌గా ఎంపిక

మదురై బాలికకు అరుదైన గౌరవం.. పేదలకు గుడ్ విల్ అంబాసిడర్‌గా ఎంపిక
, మంగళవారం, 9 జూన్ 2020 (13:31 IST)
Nethra
ఐక్యరాజ్యసమితికి చెందిన ''అసోసియేషన్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ పీస్'' చేత 13 ఏళ్ల బాలిక ''పేదలకు గుడ్ విల్ అంబాసిడర్ (జిడబ్ల్యుఎ)'' గా ఎంపికైంది. దీంతో మదురై బాలికకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. అవసరమైన వారికి సేవ చేసేందుకు పనికిరాని డబ్బు అప్రయోజనమే. దీన్ని నమ్మిన 13 ఏళ్ల మదురై బాలిక.. ధనవంతులకు సైతం బుద్ధి తెచ్చేలా చేసింది. 
 
కరోనా వైరస్ ప్రేరిత లాక్‌డౌన్ చేత తీవ్రంగా దెబ్బతిన్న వలస కూలీల కోసం తన తండ్రిని, సెలూన్ యజమానిగా, ఐదు లక్షల రూపాయల పొదుపును ఖర్చు చేసింది. ఐక్యరాజ్యసమితి అసోసియేషన్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ పీస్ (యునాడాప్) శుక్రవారం 13 ఏళ్ల బాలికను 'పేదలకు గుడ్విల్ అంబాసిడర్ (జిడబ్ల్యుఎ) గా నియమించినందున అంతర్జాతీయ గుర్తింపు లభించినట్లైంది. వివరాల్లోకి వెళితే.. మదురై, మేలామడైలో నివసిస్తున్న ఆమె తండ్రి సి మోహన్‌పై ఆదివారం ప్రసారం చేసిన తన 'మన్ కి బాత్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు.
 
యునాడాప్ ఆధ్వర్యంలో న్యూయార్క్, జెనీవాలో జరిగే యూన్ సమావేశాలలో రాబోయే సివిల్ సొసైటీ ఫోరమ్‌లను ఉద్దేశించి ప్రసంగించే అవకాశాన్ని మదురై అమ్మాయికి లభించింది. పేదలకు సహాయం చేసే ఉద్దేశంతోనే ఐరాసలో ఈ విభాగం పనిచేస్తుందని.. ఈ స్థానం ప్రపంచ నాయకులు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులు, పౌరులతో మాట్లాడటానికి, పేదవారిని చేరుకోవటానికి వారిని ప్రోత్సహించడానికి కల్పించబడిన అవకాశమని ఐరాస నేత ఒకరు తెలిపారు. 
 
ఇక మదురై అమ్మాయి నేత్ర ఈ అరుదైన గౌరవంపై మాట్లాడుతూ.. యుఎన్ ఫోరంలో 'పేదరిక నిర్మూలన'పై ప్రపంచాన్ని ఉద్దేశించి ప్రసంగించడం గౌరవంగా ఉందన్నారు. ఈ సందర్భంగా తన కుటుంబం చేసిన పోరాటాలను గుర్తుచేసుకున్న నేత్రా, 2013లో తన తండ్రి డబ్బు దొంగతనానికి గురైందన్నారు.

నీళ్లు కొనడానికి కూడా డబ్బులు వుండేవి కావని చెప్పింది. ఆ తర్వాత స్థిరత్వం కోసం తన ఉన్నత చదువుల కోసం ఐదు లక్షల రూపాయలను ఆదా చేసేందుకు తమకు ఏడు సంవత్సరాల కాలం పట్టిందని చెప్పుకొచ్చారు. అయినా తనలాంటి పేదలకు సేవలు కొనసాగిస్తుందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వావ్.. వాట్సాప్‌లో ఐదు కొత్త ఫీచర్స్.. అవేంటో తెలుసా?