Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలం డ్యాంకు కొనసాగుతున్న వరద

Webdunia
శనివారం, 12 అక్టోబరు 2019 (15:05 IST)
కర్ణాటక ఎగువ ప్రాంతంలోని కృష్ణ పొంగి ప్రవహించడంతో శ్రీశైల జలాశయం కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయం కు ఇన్‌ఫ్లో లక్ష.42.435 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, దీంతో డ్యాం నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకుని నిండు కుండలా మారింది.

డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టానికి కేవలం 7 పాయింట్లు, నాలుగు టీఎంసీలు మాత్రమే తక్కువగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రాల్లో ముమ్మరంగా అన్ని యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం డ్యాం నీటిమట్టం శనివారం ఉదయం కు 884.30 అడుగులు, జలాశయ నీటినిల్వ సామర్థ్యం 211.4759 టీఎంసీలుగా నమోదయ్యాయి.

శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, నీటినిల్వలు 215.8070 టీఎంసీలు. జూరాల విద్యుదుత్పత్తి ద్వారా 45,439 క్యూసెక్కులు, స్పిల్ వే ద్వారా 24345 క్యూసెక్కులు, సుంకేసుల మీదుగా రోజా నుంచి తుంగభద్రకు 75 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది.

మొత్తం లక్షా 43 వేల 435 క్యూసెక్కుల నీరు జలాశయం కు చేరుకుంటుంది. వీటిలో శ్రీశైలం కుడిగట్టు విద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ జలాశయం నుంచి 26,535 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటున్నారు. ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ జలాశయం నుంచి 42,378 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటున్నారు.

గడచిన 24గంటల వ్యవధిలో శ్రీశైలం కుడి, ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రాల నుంచి 32.984 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తిచేసి గ్రిడ్‌కు అందించారు. గడచిన 24గంటల వ్యవధిలో జలాశయానికి లక్షా నలభై మూడు వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి 79,036 క్యూసెక్కుల నీటిని ఔట్‌ఫ్లోగా విడుదలవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments