Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 132కి చేరిన కరోనా కేసుల సంఖ్య

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (10:52 IST)
రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. గురువారం ఒక్కరోజే 21 మందికి కరోనా పాజిటివ్​ నిర్ధరణ అయింది. గుంటూరు జిల్లాలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. కరోనా సోకిన వారిలో దిల్లీ వెళ్లొచ్చిన వారే అధికంగా ఉన్నారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. తాజా కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 132కు చేరింది.

దిల్లీలో మతపరమైన సమావేశానికి హాజరై వచ్చినవారు, వారి సన్నిహితుల వల్లే కేసులు ఇంత భారీగా పెరిగినట్లు అధికారిక సమాచారం. అలాగే విదేశాల నుంచి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా మెలిగినవారు వీరిలో ఉన్నారు. దిల్లీ నుంచి వచ్చిన వారి వల్ల రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరగటంతో యంత్రాంగం అప్రమత్తమైంది.

దిల్లీ నుంచి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా మెలిగిన వారి కోసం అన్ని జిల్లాల్లో జల్లెడ పడుతోంది. ఇలాంటి వారు 1085 మంది ఉన్నారని, వారిలో 21 మందిని తప్ప మిగతా అందరినీ గుర్తించామని ముఖ్యమంత్రి జగన్ బుధవారం సాయంత్రం ప్రకటించారు.

ప్రభుత్వం వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తోంది. లక్షణాలు ఉన్నా... లేకపోయినా వారందరికీ వ్యాధి నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తోంది.

ఏపీ లో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు. జిల్లాల వారీగా...
 
కృష్ణా లో 15
గుంటూరు లో 20
ప్రకాశం లో 17
కడప లో 15
చిత్తూరు లో 8
విశాఖలో 11
అనంతపురంలో 2
నెల్లూరు లో 20
కర్నూల్ లో 1
పగో లో  14
 
శ్రీకాకుళం, విజయనగరం లో నమోదు కాని కరోనా పాజిటివ్ కేసులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments