Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బే... ఆ డిక్లరేషన్ మినహాయింపు జగన్ కు మాత్రమే: మంత్రి పెద్దిరెడ్డి

Webdunia
ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (15:41 IST)
తిరుమలలో డిక్లరేషన్ మినహాయింపు ముఖ్యమంత్రి జగన్ కు మాత్రమేనని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే అన్యమతస్థులు డిక్లరేషన్‌ సమర్పించాల్సిన అవసరం లేదన్న టిటిడి ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై దుమారం రేగిన విషయం తెలిసిందే.

ఈ వ్యాఖ్యలపై మాజీ సిఎం చంద్రబాబు మాట్లాడుతూ.. డిక్లరేషన్‌ అక్కర్లేదనడం ఆధ్యాత్మిక ద్రోహమన్నారు. అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని మార్చడం సరికాదని పేర్కొన్నారు.

మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో సిఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తన పాలనా కాలంలో ఎలాంటి డిక్లరేషన్‌ ఇవ్వలేదని, 5 సంవత్సరాలు స్వామి వారికి పట్టువస్త్రాలు ఇచ్చారని, ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్‌.జగన్‌ డిక్లరేషన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు.

అందరూ డిక్లరేషన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని టిటిడి ఛైర్మన్‌ అనలేదని స్పష్టం చేశారు. ఆ విషయమై తనకు టిటిడి ఛైర్మన్‌ క్లారిటీ కూడా ఇచ్చారని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. టిటిడి ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి ప్రకటనను వివాదం చేయొద్దని కోరారు. 

సంబంధిత వార్తలు

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

చిన్న సినిమాలను బతికించండి, డర్టీ ఫెలో ప్రీ రిలీజ్ లో దర్శకుడు ఆడారి మూర్తి సాయి

కేన్స్‌లో పదర్శించిన 'కన్నప్ప‌' టీజర్ - మే‌ 30న తెలుగు టీజర్

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments