Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రెండు పార్టీల నడుమ ఓట్ల తేడా 10 లక్షలే

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (11:26 IST)
మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి...ఓటింగ్‌ శాతం ఎంత అనేది ఎన్నికల సంఘం విడుదల చేసింది. 

మొత్తం 47,46,195 ఓట్లు చెల్లగా దీనిలో అధికార వైకాపాకు దాదాపు 24.97 లక్షల ఓట్లు రాగా ప్రతిపక్ష టిడిపికి 14.58 లక్షల ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో వైకాపా 52.63శాతం ఓట్లు సాధించగా, ప్రతిపక్ష టిడిపి 30.73శాతం ఓట్లు సాధించాయి.

24లక్షల ఓట్లు సాధించిన వైకాపా 2265 వార్డులు/డివిజన్‌లు సాధించగా, టిడిపి 349 వార్డులు/డివిజన్‌లు సాధించింది. కాగా రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా విజయం తమదేనని చెబుతోన్న 'బిజెపి' పార్టీకి లక్షకు చిల్లర ఓట్లు వచ్చాయి.

మొత్తం 2.41శాతం ఓట్లు సాధించిన ఆ పార్టీ 9 వార్డులు/డివిజన్‌లు సాధించి 0.3శాతం వార్డుల విజయాన్ని నమోదు చేసింది. ఇక 'జనసేన' 2.21లక్షలకు పైగా ఓట్లు సాధించింది. దీని ఓటింగ్‌ శాతం 4.67 కాగా 25 డివిజన్లు/వార్డులు సాధించింది.

ఇది మొత్తం విన్నింగ్‌ శాతంలో 0.9శాతం. 'జనసేన+బిజెపి' కూటమి 5.8శాతం ఓట్లు సాధించింది. సిపిఐ 38వేలు ఓట్లు సాధించగా, సిపిఎం 38 వేలు ఓట్లు సాధించింది.

ఒకప్పుడు రాష్ట్రాన్ని ఏకచత్రాధిపత్యంగా ఏలిన కాంగ్రెస్‌ పార్టీ 29వేల ఓట్లు సాధించగా, బిఎస్పీ 4వేలు ఇతర గుర్తింపు పొందిన పార్టీలు 20వేల ఓట్లు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments