Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమిళనాడులో బీజేపీకి 10 వేల ఓట్లు కూడా రావు

Advertiesment
తమిళనాడులో బీజేపీకి 10 వేల ఓట్లు కూడా రావు
, ఆదివారం, 7 మార్చి 2021 (11:49 IST)
అన్నాడీఎంకే కూటమిలో పోటీచేయనున్న బీజేపీకి ఒక్కో నియోజకవర్గంలో 10 వేల ఓట్లు కూడా రావని, ఆ నియోజకవర్గాల్లో డీఎంకే కూటమి విజయం తథ్యమని డీపీఐ అధ్యక్షుడు తిరుమావళవన్‌ అభిప్రాయపడ్డారు.

ప్రజావ్యతిరేకవిధానాలు అవలంభిస్తున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వానికి అన్నాడీఎంకే అండగా నిలిచిందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఈ కూటమికి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

రాష్ట్రంలో బీజేపీ కాలుమోపే అవకాశమే లేదని, ఆ పార్టీ పోటీచేస్తున్న నియోజకవర్గాలు అన్నింటిలో డీఎంకే కూటమి విజయం సాధిస్తుందని అన్నారు.

డీఎంకే కూటమిలో తమకు సీట్ల కేటాయింపుపై కొంత అసంతృప్తి వున్నా, మతవాదశక్తులను అడ్డుకోవడం, కూటమి అధికారంలోకి రావడమే లక్ష్యంగా సర్దుబాటుకు అంగీకరించినట్టు తిరుమావళవన్‌ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిజెపి, వైకాపా, టిడిపి, జనసేన దుష్టచతుష్టయ పార్టీలు: తులసి రెడ్డి