Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

ఠాగూర్
బుధవారం, 4 జూన్ 2025 (16:10 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలోని పెద్ద ధన్వాడ వద్ద ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని స్థానిక రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఫలితంగా ఇథనాల్ చిచ్చు చెలరేగింది. పరిశ్రమ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు ఆందోళనకు దిగారు. పరిశ్రమ నిర్మాణ ప్రాంతంలోకి చొచ్చుళ్లి విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.
 
జిల్లాలోని పెద్ద ధన్వాడ గాయత్రి కంపెనీ ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోందని అయితే, ఈ పరిశ్రమ ఏర్పాటును స్థానిక రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాదాపు 12 గ్రామాలకు చెందిన ప్రజలు ఈ ఆందోళనలో పాలుపంచుకున్నారు. మంగళవారం కంపెనీ ప్రతినిధులు పరిశ్రమ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు కూలీలను తీసుకునిరావడంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 
 
ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం పెద్ద ఎత్తున రైతులు, మహిళలు పరిశ్రమ ఏర్పాటు చేయతలపెట్టిన ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసుల బందోబస్తు ఉన్నప్పటికీ ఆందోళనకారులు నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన టెంట్లు, గుడారాలను ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యంగా పనులు చేసేందుకు వచ్చిన వలస కూలీలపై రాళ్లతో దాడి చేయడంతో వారు ప్రాణభయంతో పరుగులు తీశారు. దీంతో పెద్ద ధన్వాడలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న జిల్లా పోలీస్ యంత్రాంగం భారీ సంఖ్యలో పోలీస్ బలగాలను మొహరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments