Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏఐ- సెక్యూరిటీ సదస్సు కోసం పరిశ్రమ నాయకులను ఏకతాటి పైకి తీసుకువచ్చిన అసోచామ్- తెలంగాణ ప్రభుత్వం

Advertiesment
image

ఐవీఆర్

, గురువారం, 20 ఫిబ్రవరి 2025 (18:41 IST)
హైదరాబాద్: అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్), తెలంగాణ ప్రభుత్వంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ (IT, E-C) శాఖ సహకారంతో;  టి హాబ్ యొక్క సెంటర్ అఫ్ ఎక్సలెన్స్ (CoE), MATH, డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(DSCI); ISACAలు "ఇన్నోవేషన్ నెక్సస్- కాన్ఫరెన్స్ ఆన్ సెక్యూరిటీ, డేటా ప్రొటెక్షన్ & AI"ని HICC, నోవాటెల్, హైదరాబాద్‌లో విజయవంతంగా నిర్వహించింది.
 
సాంకేతిక పురోగతులు, పరిశ్రమలు, సమాజాన్ని ఎలా పునర్నిర్మిస్తున్నాయనే దానిపై పరిజ్ఞానం అందించడానికి, కృత్రిమ మేధస్సు (AI), ముఖ్యంగా ఉత్పాదక AI నమూనాలు, వాటి వినియోగం లో అభివృద్ధి చెందుతున్న ధోరణులను అన్వేషించడానికి ఈ సమావేశం ఒక వేదికగా ఉపయోగపడింది.  జెన్ AI యుగంలో డేటా రక్షణ, గోప్యతపై దృష్టి కేంద్రీకరించిన కీలక సెషన్‌లు, నేటి డిజిటల్ వాతావరణంలో అవసరమైన ఉత్తమ పద్ధతులు, నియంత్రణ కార్యాచరణ పద్ధతులను వెల్లడించాయి.
 
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు-వాణిజ్యం, IT, E-C డిపార్ట్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ జయేష్ రంజన్, ఐఏఎస్ మాట్లాడుతూ పటిష్టమైన భద్రతా చర్యలు, గోప్యతా ప్రోటోకాల్‌లు, నైతిక AI విస్తరణతో సాంకేతిక ఆవిష్కరణలను సమతుల్యం చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. సాంకేతికత అభివృద్ధి చెందుతున్నందున, AI యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటూ భద్రతా వ్యూహాలు, డేటా రక్షణ విధానాలను నిరంతరం పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.
 
జాతీయ భద్రత, సైబర్ భద్రతపై గురించి శ్రీ. జి నరేంద్ర నాథ్, ITS, జాయింట్ సెక్రటరీ, జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ (NSCS), భారత ప్రభుత్వం, మాట్లాడారు. CtrlS- Cloud4C డైరెక్టర్-కంప్లయన్స్ శ్రీ చంద్ర శేఖర్ శర్మ గరిమెళ్ల, ISACA హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్, భద్రత- క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై తన నైపుణ్యాన్ని పంచుకున్నారు. 
 
అసోచామ్ స్టేట్ హెడ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా, శ్రీ దినేష్ బాబు మచ్చ మాట్లాడుతూ సదస్సుకు తమ విలువైన సహకారాన్ని అందించిన విశిష్ట వక్తలు, పరిశ్రమల ప్రముఖులు కు కృతజ్ఞతలు తెలిపారు. సురక్షితమైన డిజిటల్ భవిష్యత్తును నిర్ధారించడానికి సైబర్ భద్రత, డేటా గోప్యత మరియు AI యొక్క నైతిక విస్తరణపై నిరంతర సహకారం యొక్క అవసరాన్ని ఆయన వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అడవి పందుల వేటకెళ్లి కుటుంబ సభ్యులు మృతి.. ఎలా జరిగింది?