Webdunia - Bharat's app for daily news and videos

Install App

YouTuber : పాకిస్థాన్‌తో సంబంధాలు.. పంజాబ్ యూట్యూబర్ అరెస్ట్.. ఏం చేశాడంటే?

సెల్వి
బుధవారం, 4 జూన్ 2025 (15:12 IST)
Jasbir Singh
పాకిస్థాన్‌తో సంబంధాలు సాగిస్తున్న ఆరోపణలపై యూట్యూబర్ జస్బీర్ సింగ్‌‌ను పంజాబ్ పోలీసులు బుధవారంనాడు అరెస్టు చేశారు. హర్యానా ఇన్‌ఫ్లుయెన్సర్ జ్యోతి మల్హోత్రాను ఇదే ఆరోపణలపై ఇటీవల అరెస్టు చేశారు. పంజాబ్‌లోని రూప్‌నగర్ జిల్లా మహ్లాన్ గ్రామానికి చెందిన జస్బీర్ సింగ్ 'జాన్ మహల్' పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నాడు. 
 
ఈ వ్యక్తికి పాక్ రాయబార కార్యాలయం అధికారి ఎహసాన్ ఉర్ రహీం అలియాస్ డాన్‌ష్‌తో సింగ్‌కు సంబంధాలున్నాయని, డానిష్ ఆహ్వానం మేరకు ఢిల్లీలో జరిగిన పాకిస్థాన్ జాతీయ దినోత్సవంలో కూడా సింగ్ పాల్గొన్నాడని తెలిసింది. 
 
ఇంకా అక్కడ పాకిస్థాన్ ఆర్మీ ఆధికారులు, వ్లోగర్లను సింగ్ కలుసుకున్నాడని విచారణలో తేలింది. అంతేగాకుండా.. 2020, 2021, 2024లో మూడు సందర్భాల్లో జస్బీర్ సింగ్ పాకిస్థాన్‌కు వెళ్లాడని, ఆయనకు పాకిస్థాన్ బేస్డ్ కాంటాక్టులు ఉన్నట్టు అతని వద్ద స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాల ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలిందని పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) గౌరవ్ యాదవ్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ రేంజ్‌లో సాగుతున్న 'వీరమల్లు' రికార్డులు... పాత రికార్డులు గల్లంతేనా?

Hansika: నటి హన్సిక మోత్వానీ విడాకులకు సిద్ధమైందా..?

Tanushree Dutta: నన్ను వేధిస్తున్నారు, కాపాడండి, తనుశ్రీ కన్నీటి పర్యంతం (video)

Rasi: ప్రేయసిరావే లో శ్రీకాంత్‌ని కొట్టాను, హిట్‌ అయ్యింది, ఉసురే కూడా అవుతుంది : హీరోయిన్‌ రాశి

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments