పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తుందన్న ఆరోపణల నేపథ్యంలో అరెస్టయి హర్యానా హిస్సార్ ప్రాంతానికి చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన మరో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్, ఫోన్ల నుంచి డిలీట్ చేసిన సమాచారాన్ని ఫోరెన్సిక్ నిపుణులు తిరిగి రికరీ చేశారు. ఇలా తొలగించిన సమాచారమంతా కలిపి 12 టెరాబైట్ల మేరకు ఉందన్నట్టు సమాచారం. అలాగే, ఈ కేసులో మరిన్ని ఆధారాల కోసం ఆ డేటాను స్కాన్ చేస్తున్నారు.
తాను ఐఎస్ఐకు సంబంధించిన వ్యక్తులతో మాట్లాడుతున్నానని తెలిస్తే కాంటాక్ట్ కొనసాగించారని ఆ సమాచారం ఆధారంగా ప్రాథమికంగా గుర్తించారు. నలుగురు పాక్ ఐఎస్ఎస్ ఏజెంట్లతో నేరుగా జ్యోతి మాట్లాడినట్టు గుర్తించారు. వారిలో డానిష్, అహ్సాన్, షాహిద్ ఉన్నారని ఆ వర్గాలు వెల్లడించాయి. ఐఎస్ఐలో ఆ ఏజెంట్ల హోదాలు, ఉద్యోగాలు ఏంటో ధృవీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారు.