Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మీడియాలో విష సంస్కృతి... 4 ఛాన‌ళ్ళపై టీడీపీ బ్లాక్ లిస్ట్!

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (13:23 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజకీయాలు దారుణంగా మారాయి. రోజు రోజుకు పార్టీల మ‌ధ్య అంత‌రాలు పెరిగిపోయి, చివ‌రికి మీడియాలో కూడా విష సంస్కృతి మొద‌లైపోయింది. ఇప్ప‌టికే ఫ‌లానా ఛాన‌ల్ ఫ‌లానా పార్టీది అని, ఫ‌లానా పేప‌ర్ ఫ‌లానా పార్టీకి కొమ్ము కాస్తుంద‌నే ముద్ర ఎపుడో ప‌డిపోయాయి. ఇక అవి శృతి మించి, ఒక‌రిపై ఒక‌రు బ్యాన్ లు పెట్టేవ‌ర‌కు, ఛాన‌ళ్ళ‌ను బ్లాక్ లిస్ట్ లో పెట్టేవ‌ర‌కు ప‌రిస్థితి వెళ్లిపోయింది. తాజాగా నాలుగు ఛాన‌ళ్ల‌ను తాము బ్లాక్ లిస్ట్ లో పెట్టిన‌ట్లు తెలుగుదేశం పార్టీ వారి వాట్స్ అప్ సందేశాలు వైర‌ల్ అయ్యాయి.
 
 
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఇంచార్జ్, పార్లమెంట్ ప్రెసిడెంట్, రాష్ట్ర కమిటీ సభ్యులకు, ముఖ్య నాయకులకు  నమస్కారం అంటూ టీడీపీ ఒక మెసెజ్ అంద‌రికీ పాస్ చేసింది. తెలుగుదేశంపార్టీ ఈ నాలుగు చానళ్లను బ్లాక్ లిస్టులో పెట్టిన‌ట్లు తెలిపింది. సాక్షి, ఐ-డ్రీమ్, టివి-9, ప్రైమ్ 9 నాలుగు ఛాన‌ళ్ళ‌ను త‌మ పార్టీ ప‌క్క‌న పెట్టేసిన‌ట్లు పేర్కొంది. దయ ఉంచి ఈ చానళ్లకు, ఎటువంటీ ఇంటర్వ్యూలు ఇవ్వ‌డానికి తెలుగుదేశం నాయకులు వెళ్లరాదని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అమరావతి కార్యాలయం ఆదేశాలు జారీ చేసిన‌ట్లు ఈ మెసేజ్ అంద‌రికీ పాస్ చేశారు. ఈ నాలుగు ఛాన‌ళ్ళు తెలుగుదేశం పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల్లో మునిగిపోయాయ‌ని, వాటిని ఎట్టి ప‌రిస్థితులలో ప్రోత్స‌హించ‌రాద‌ని పార్టీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. పైగా ఇలా చేయ‌డం త‌గిన స‌మ‌యంలో త‌గిన చ‌ర్య అని మిగ‌తా తెలుగుదేశం నాయ‌కులు సంఘీభావం తెల‌ప‌డం కొస‌మెరుపు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments