Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచ లింగాల వ‌ద్ద భారీగా తెలంగాణ మద్యం స్వాధీనం, కారు సీజ్

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (11:08 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని కర్నూలు పట్టణ  శివారులో పంచ లింగాల అంతరాష్ట్ర చెక్ పోస్ట్ లో భారీగా తెలంగాణా మ‌ద్యం ప‌ట్టుబ‌డింది. జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి, ఎస్ ఇ బి అడిషిన‌ల్ ఎస్పీ తుహీన్ సీన్హా ఆదేశాల మేరకు  గురువారం తెల్లవారు జామున సి ఐ మంజుల, యస్ ఐ రాముడు, సిబ్బంది చేపట్టిన తనిఖీల్లో తెలంగాణ రాష్ట్రం అలంపూర్ వైపు నుండి ఫోర్డ్ ఫియేస్ట కారు AP 28 DK 2491 ప‌ట్టుబ‌డింది. 
 
 
కారును ఆపి తనిఖీ చేయగా, అందులో కర్నూల్ పట్టణం ఒబుల్లయ్య నగర్ షరీన్ నగర్ కు చెందిన బండి సురేష్ బాబు (42)  తెలంగాణ రాష్ట్రం గద్వాల్ నుండి 7 బాక్సుల మద్యం కొనుగోలు చేసి కర్నూల్ కు తరలిస్తూ అధికారుల తనిఖీల్లో దొరికాడు. కారులో 108 అక్రమ తెలంగాణ ఫుల్ బాటిళ్లు మద్యం వున్న 7 కాటన్ బాక్స్ లు స్వాధీనం చేసుకున్నారు. 
 
 
వాటిని కర్నూల్ లో అమ్మ‌డానికి సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గత రెండు నెలల క్రితం ఇదే వ్యక్తి కారులో అక్రమ మద్యం తరలిస్తూ, పంచ లింగాల చెక్ పోస్ట్ వద్ద దొరికాడు. పట్టుకొన్న మద్యం బాటిళ్లును, కారును సీజ్ చేసి  కర్నూల్ పోలీసు స్టేషన్ కు అప్పగించినట్లు సి ఐ మంజుల తెలిపారు. ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుళ్లు ఖాజా, జగన్నాథం, రంగ స్వామిలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

వాస్తవ సంఘటనలకు అద్దం పట్టే మిస్టర్ మాణిక్యం గా సముద్రఖని

సింగర్ మంగ్లీకి ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ పురస్కారం ప్రదానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments