Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్యాయంగా పిలిచి ప్రేయసి గొంతు కోసిన ఉన్మాది ప్రియుడు

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (19:14 IST)
తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండలో దారుణం జరిగింది. ఓ ఉన్మాది తన ప్రియురాలి గొంతు కోశాడు. నమ్మకంగా తన వద్దకు రప్పించి.. ఆ తర్వాత బ్లేడుతో ఆ యువతి గొంతుకోశాడు. దీంతో ఆ యువతి ఇపుడు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ దారుణానికి పాల్పడిన తర్వాత నిందితుడు నేరుగా కోర్టుకెళ్లి జడ్జి ముందు లొంగిపోయాడు.
 
శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, హన్మకొండ రాంనగర్‌కు చెందిన షాహిద్ అనే యువకుడు స్థానికంగా ఉండే ఓ యువతిని ప్రేమిస్తూ వచ్చాడు. అయితే, ఉన్నట్టుండి వారి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదుకానీ.. ఉన్నట్టుండి ప్రియురాలిని గొంతు కోశాడు. 
 
దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ యువతి ఘటనాస్థలిలోని స్పృహ కోల్పోయింది. ఆ పిమ్మట పోలీసులు అక్కడకు చేరుకుని బాధితురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా, బాధితురాలిని లష్కర్ సింగారం గ్రామానికి చెందిన హారతిగాను, ఉన్మాది స్వస్థలం కాజీపేటగా పోలీసులు గుర్తించారు. 
 
షాహిద్ చైతన్యపురిలోని ఓ మటన్ షాపులో పని చేస్తూ హారతిని ప్రేమిస్తూ వచ్చాడు. అయితే, ప్రియురాలిపై ఉన్న పెంచుకున్న అనుమానంతో ఈ దారుణానికి పాల్పడివుంటాడని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్ గా విజయ్ ఆంటోని మార్గన్‌ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments