Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంగారెడ్డిలో అమ్మాయిలు అమ్మబడును : సంతలో అమ్మాయిలు

Webdunia
గురువారం, 31 అక్టోబరు 2019 (18:23 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలోని సంతలో అమ్మాయిలను విక్రయిస్తున్నారు. సంతలో పశువులను విక్రయించినట్టుగా పడుచు యువతులను విక్రయిస్తున్నారు. వీరి ధర లక్షల్లో పలుకుతోంది. ఈ దారుణం జిల్లాలోని గిరిజన తండాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సంగారెడ్డి జల్లా నారాయణ ఖేడ్‌లో అమాయక గిరిజన యువతుల్ని అమ్మకానికి పెడుతున్నారు. నాలుగేళ్లుగా ఈ అమానుష దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. 
 
అమాయక అమ్మాయిల్ని పెళ్లి పేరుతో మోసం చేసి వారి జీవితాల్ని నాశనం చేస్తున్నారు. డబ్బుల కోసం అమ్మాయిల్ని రాజస్థాన్‌కు చెందిన దళారులకు నిర్దాక్షిణ్యంగా అమ్మేస్తున్నారు. అయితే, ఈ దందా వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 
 
డబ్బుకు ఆశపడిన అనేక గిరిజన తండాలకు చెందిన ప్రజలు, పిల్లలను పోషించలేక తమ బిడ్డలను అమ్ముతున్నట్టు సమాచారం. ఒక్కో అమ్మాయి ధర రూ.15 లక్షల మేరకు పలుకుతోందట. వ్యాపారం పేరుతో.. రాజస్థాన్ నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు.. నారాయణ ఖేడ్‌లో నివాసం ఏర్పరచుకుని, ఆ తర్వాత అమ్మాయిల విక్రయ కార్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా పూర్తి చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments