Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పంది కడుపున ఏనుగు.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతుందా?

Advertiesment
పంది కడుపున ఏనుగు.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతుందా?
, గురువారం, 31 అక్టోబరు 2019 (18:03 IST)
పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పిన ప్రతి విషయం ఆచరణలో తు.చ. తప్పకుండా జరుగుతున్నాయి. ఇప్పటికే అనేక సంఘటనలు జరిగాయి కూడా. ఇపుడు తాజాగా... పంది కడుపున ఏనుగు పిల్ల జన్మించింది. ఈ వింత సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పాలమూరు జిల్లా గూడూరు మండలం నాయకపల్లి గ్రామంలో ఓ పంది ఏనుగు పిల్లకు జన్మనిచ్చింది. పందికి ఏనుగు పిల్ల జన్మించడం పట్ల స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. గ్రామానికి చెందిన రాయపురం సారయ్య అనే వ్యక్తి పందులను పెంచి పోషించేవాడు. ఈ పంది గురువారం ఉదయం ప్రసవించింది. ఇందులో ఓ పిల్ల ఏనుగు ఆకారంలో ఉన్న వింత జీవి జన్మించింది. తొండం, దంతాలు, పాదాలు అన్నీ ఏనుగును పోలి ఉన్నాయి.
 
అయితే పుట్టిన కొద్ది క్షణాలకే ఆ వింత ఆకారం గల జంతువు మృతి చెందింది. గ్రామస్తులతో పాటు చుట్టు పక్కల గ్రామల ప్రజలు సైతం తండోపతండాలుగా ఆ వింతను చూడటానికి నాయకపల్లి గ్రామానికి తరలి వచ్చారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన మాటలే ఇప్పుడు నిజమవుతున్నాయంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగారంపై ఆమ్నెస్టీ లేదు... అదంతా ఉత్తుత్తి ప్రచారమే...