Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగరేణి సిగలో 'గులాబీ' పూసింది... చరిత్ర సృష్టించిన తెరాస కార్మిక సంఘం

సింగరేణి గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్‌) ఘన విజయం సాధించింది. గురువారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 11 డివిజన్లు ఉండగా మొత్తం 9 డివిజ

Webdunia
శుక్రవారం, 6 అక్టోబరు 2017 (09:56 IST)
సింగరేణి గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్‌) ఘన విజయం సాధించింది. గురువారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 11 డివిజన్లు ఉండగా మొత్తం 9 డివిజన్లలో విజయబావుటా ఎగురవేసింది. విపక్ష పార్టీలు కేవలం 2 డివిజన్లలో మాత్రమే గెలుపొందారు. ఈ ఎన్నికల్లో అధికార తెరాస పార్టీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నీ కలిసి పోటీ చేసిన సరైన పోటీని ఇవ్వలేకపోయాయి. ఫలితంగా విపక్షాలన్నీ చతికిల పడ్డాయి. తెరాస అనుబంధ కార్మిక సంఘం అన్ని డివిజన్లలోనూ 50 శాతం ఓట్లు సాధించి రికార్డు సృష్టించింది. 
 
ఈ కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఘన విజయం సాధించింది. గురువారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 11 డివిజన్లకు గాను 9 డివిజన్లలో విజయ ఢంకా మోగించింది. విపక్షాలు బలపరిచిన ఏఐటీయూసీ రెండు డివిజన్లకే పరిమితమైంది. 2012లో తొలిసారి ఉద్యమ వేడిలో గెలిచిన టీబీజీకేఎస్ ఈసారి ఏకంగా 9 డివిజన్లలో సత్తా చాటింది. ఫలితంగా ఈ ఏరియాల్లో గుర్తింపు సంఘంగా గౌరవం అందుకోనుంది.
 
గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ జరిగింది. 52,534 మందికిగాను 49,873 మంది (94.93 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్ పూర్తయిన వెంటనే లెక్కింపు మొదలుపెట్టారు. రాత్రి బాగా పొద్దుపోయాక ఫలితాలు వెలువడ్డాయి. పోటీ పడిన అన్ని డివిజన్లలోనూ టీబీజీకేఎస్ 50 శాతానికిపైగా ఓట్లు సాధించి చరిత్ర సృష్టించింది. టీబీజీకేఎస్‌కు ఏఐటీయూసీ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tabu: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి చిత్రంలో టబు ఎంట్రీ

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

Charan: పెద్ది ఫర్ ప్రదీప్ అని రామ్ చరణ్ చెప్పడం చాలా హ్యాపీ : ప్రదీప్ మాచిరాజు

chiru: చిరంజీవి విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్ పోస్టర్ రిలీజ్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments