Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయరాం హత్య కేసు.. మేన కోడలు శిఖా చౌదరికి క్లీన్ చిట్

Webdunia
గురువారం, 2 మే 2019 (15:29 IST)
చిగురుపాటి జయరాం హత్య కేసులో ఇంకా కూడా విచారణ జరుగుతుంది. దర్యాప్తు చేస్తున్న పోలీసులు రోజురోజుకి ఒక ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడిస్తున్నారు. ఎంత సాగదీస్తున్నా ఈ కేసు అంతే సాగుతుంది.


ఒక నిందితుడు రాకేశ్‌తో మొదలై ఆపై ఒక లేడి ఆపై ఇక చాలామందికి ఈ కేసులో హస్తం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురిలో విశాల్, నగేష్ ఇద్దరు ఈ కేసులో కీలక పాత్ర పోషించారని చెప్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జి షీటులో మేనకోడలు శిఖా చౌదరికి క్లీన్ చీట్ ఇచ్చారు. ఈ కేసులో 388 పేజీల ఛార్జిషీట్‌ను జూబ్లిహిల్స్ పోలీసులు దాఖలు చేశారు.
 
ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేయనున్నట్టు సమాచారం. ఈ కేసులో మొత్తం 70 మందిని ప్రశ్నించగా.. ఛార్జిషీట్‌లో రాకేశ్, శ్రీనివాస్, సినీనటుడు సూర్యప్రసాద్, కిశోర్, విశాల్, నగేశ్, అంజిరెడ్డి, సుభాష్ రెడ్డి పేర్లు నమోదు చేసినట్టు తెలుస్తోంది. జయరాం జనవరి 31న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతంలో తన కారులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments