తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు ఫైర్ అయ్యారు. నోరు అదుపులో పెట్టుకోవాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇంకా మాట్లాడే భాష మార్చుకోవాలని.. అహంకారపు మాటలు వద్దని హితవు పలికారు. తాను ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్‌కే రాజకీయ భిక్ష పెట్టానని, అలాంటి తనను బఫూన్ అంటావా? అంటూ వీహెచ్ ఫైర్ అయ్యారు.
సమయం వచ్చినప్పుడు ఎవరు బఫూనో తేలుతుందని వీహెచ్ పేర్కొన్నారు. తన బావమరిదికి గ్లోబరినాతో సంబంధం లేకుంటే ఎందుకు పెద్దమ్మ గుడికి రాలేదని కేటీఆర్‌ను ప్రశ్నించారు. కేటీఆర్ అహంకార పూరిత ధోరణి మంచిది కాదని చెప్పుకొచ్చారు.
ఒకవేళ గ్లోబరీనా సంస్థతో కేటీఆర్ బామ్మర్ధికి సంబంధం లేకుంటే.. తాను విసిరిన సవాల్ ప్రకారం పెద్దమ్మ గుడికి ఆయన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. గ్లోబరీనా వ్యవహారంలో కేటీఆర్‌కు సంబంధం లేకుంటే పెద్దమ్మపై ప్రమాణం చేస్తారా అని సవాల్ విసిరారు.