Webdunia - Bharat's app for daily news and videos

Install App

నమ్మించి తీసుకెళ్లాడు.. ఫోన్ చేసి ఫ్రెండ్స్‌ను పిలిచి రేప్ చేశాడు...

Webdunia
శనివారం, 18 మే 2019 (13:10 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా రాయవరం గ్రామంలో ఓ దళిత యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. తన స్నేహితుడు నమ్మించి తీసుకెళ్లి ఫ్రెండ్స్‌తో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణంగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాయవరం గ్రామానికి చెందిన 12 యేళ్ళ బాలిక ఇటీవల తన స్నేహితుడుతో కలిసి బైకుపై షికారుకు వెళ్ళింది. అతను షికారుకు తీసుకెళ్లకుండా ఎవరూ లేని చోటికి తీసుకెళ్లాడు. అక్కడ నుంచి తన ఫ్రెండ్స్‌కు ఫోన్ చేసి రప్పించాడు. 
 
ఆ తర్వాత ముగ్గురూ కలిసి ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగని ఆ ముగ్గురు కామాంధులు రాత్రంతా లైంగికంగా వేధించారు. మరుసటిరోజు వేకువజామున అక్కడే వదిలేసి పారిపోయారు. 
 
అయితే, రాత్రంతా బాలిక ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టగా, ఆ బాలిక అచేతన స్థితిలో కనిపించింది. ఇంటికి తీసుకెళ్లి ఆరా తీయగా తనకు జరిగిన ఘోరాన్ని వెల్లడించింది. ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు జగదేవపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం