గుట్కా వేసుకుంటూ బస్సును గుంటలో బోల్తా కొట్టించిన డ్రైవర్

బుధవారం, 15 మే 2019 (14:48 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ డ్రైవర్ తన విధుల్లో నిర్లక్ష్యంగా నడుచుకున్నాడు. ఫలితంగా బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో 35 మంది వరకు గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. 
 
బుధవారం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, భూపాలపల్లి జిల్లాలోని మల్హార్ మండలం సోమన్‌పల్లి వంతెన వద్ద బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. బస్సు డ్రైవర్.. బస్సు రన్నింగ్‌లో ఉండగా.. గుట్కా వేసుకోవడంతో బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టినట్టు బస్సులోని ప్రయాణికులు తెలిపారు. బస్సు గోదావరిఖని నుంచి భూపాలపల్లి వెళ్తుండ‌గా ఈ ప్రమాదం జరిగింది. 
 
ఈ ప్రమాదంలో 35 మందికి గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని మహదేవ్‌పూర్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ప్రాణాలు తీసిన ఐపీఎల్ బెట్టింగ్...