Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల.. జగిత్యాల ఫస్ట్ - హైదరాబాద్ లాస్ట్

Advertiesment
Telangana 10th Board Result Out
, సోమవారం, 13 మే 2019 (12:39 IST)
తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం ఉదయం సచివాలయం డీబ్లాక్‌ సమావేశ మందిరంలో విద్యాశాఖ కార్యదర్శి జనార్దనన్‌రెడ్డి ఫలితాలను విడుదల చేశారు.


రాష్ట్రవ్యాప్తంగా 4374 పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. 98.78 శాతం ఉత్తీర్ణతతో బీసీ గురుకుల పాఠశాలలు అత్యుత్తమంగా నిలిచాయి.
 
జూన్‌ 10 నుంచి 24 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు జనార్దన్‌రెడ్డి ప్రకటించారు. పరీక్ష రుసుం చెల్లించేందుకు మే 27వ తేదీ తుది గడువు అని వెల్లడించారు.

ఇటీవల ఇంటర్‌ ఫలితాల్లో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో పదో తరగతి ఫలితాల విషయంలో ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఈ నేపథ్యంలో పదో తరగతి ఫలితాలు 13వ తేదీ విడుదలయ్యాయి. 
webdunia
 
తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఐదు లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 92.43 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 93.68 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించగా.. బాలుర ఉత్తీర్ణత శాతం 91.18గా ఉంది. ఇక 99.30 శాతం ఉత్తీర్ణతతో జగిత్యాల జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఇక చివరిస్థానంలో 89.09 శాతంతో హైదరాబాద్‌ నిలిచింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అసలే అక్రమ సంబంధం.. అనుమానంతో ప్రేయసి మర్మాంగంపై ఐరన్ బాక్సుతో వాత పెట్టాడు..