Webdunia - Bharat's app for daily news and videos

Install App

పడకసుఖం ఇవ్వలేదనీ వివాహితపై కిరోసిన్ పోసి నిప్పంటించిన ప్రియుడు

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (09:23 IST)
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో వివాహేతర హత్య జరిగింది. అక్రమసంబంధం పెట్టుకుని తనకు కొంతకాలం పడకసుఖం ఇచ్చిన వివాహిత.. ఇపుడు ఉన్నట్టుండి మాట్లాడకపోవడంతో కోపం పెంచుకున్న యువకుడు.. ఆమెను హత్య చేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని మహల్‌ ఎలికట్ట గ్రామానికి చెందిన జంగం రాములుకు అదే గ్రామానికి చెందిన వివాహిత మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో వీరిద్దరూ గత కొంతకాలంగా ఎంజాయ్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఫలితంగా కొంతకాలంగా వీరిద్దరి మధ్య మాటలులేవు. 
 
పైగా, తనతో మాట్లాడకపోగా, పడక సుఖం దక్కకపోవడంతో ఆగ్రహం హెంచుకున్న రాములు... ఆమెను ఎలాగైనా అంతమొందించాలని పన్నాగంపన్నాడు. మంగళవారం సాయంత్రం కూలీ పనులు చేసి ఇంటికి ఒంటిరిగా వెళ్తున్న మంగమ్మను రాములు వెంబడించి, పథకం ప్రకారం ముందుగానే తన వెంట తెచ్చుకున్న  కిరోసిన్‌ను ఆమె ఒంటిపై పోసి నిప్పంటించి పరారయ్యాడు. 
 
ఈ మంటలకు తాళలేక మంగమ్మ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. మంటలు ఆర్పి ఆమెను వెంటనే షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మంగమ్మను హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈమె చనిపోయే ముందు తన ప్రియుడు గురించి వాంగ్మూలం ఇవ్వగా, దాన్ని జడ్జి నమోదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న జంగం రాములు కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments