Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెలూన్లు కొనేందుకు వెళ్లిన మతిస్థిమితం లేని యువతిపై గ్యాంగ్ రేప్

Advertiesment
బెలూన్లు కొనేందుకు వెళ్లిన మతిస్థిమితం లేని యువతిపై గ్యాంగ్ రేప్
, గురువారం, 28 మార్చి 2019 (09:10 IST)
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. ఓ మతిస్థిమితంలేని 14 యేళ్ళ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మణుగూరుకు చెందిన 14 యేళ్ళ బాలిక పట్టణంలోని ఓ షాపు వద్దకు బెలూన్లు కొనుగోలు చేసేందుకు వెళ్లింది. ఆ బాలికను గుర్తించిన ముగ్గురు యువకులు తమ ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. 
 
అపుడు ఆ బాలిక గట్టిగా కేకలు వేయడంతో ఆ కామాంధులు భయపడి అక్కడ నుంచి పారిపోయారు. అనంతరం చుట్టుపక్కల వారు ఆ యువతిని రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. 
 
ఆ సమయంలో హనుమాన్‌ టెంపుల్‌ ప్రాంతంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టగా ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై అటుగా వచ్చారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, అత్యాచారానికి పాల్పడినట్టు వెల్లడించారు. పరారీలో ఉన్న మరో నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్య ఓటమిని తట్టుకోలేక గెలిచిన అభ్యర్థి భర్తను చంపేశాడు...