Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ - 200 యూనిట్ల విద్యుత్ పథకం ప్రారంభం

వరుణ్
మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (10:41 IST)
ఆరు గ్యారెంటీల్లో భాగంగా, మరో రెండు పథకాలకు ప్రభుత్వం నేడు శ్రీకారం చట్టనుంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ఇవాళ ప్రారంభించనున్నారు. చేవెళ్లలో ఈ రెండు పథకాలు ప్రారంభించాలని భావించినా, ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్‌ రావడంతో సచివాలయంలో మొదలు పెట్టాలని నిర్ణయించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసిన తెల్లరేషన్ కార్డుదారులకు ఈ రెండు పథకాలను అమలు చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సాయంత్రం జరిగే సభలో పార్టీ అగ్రనేత ప్రియాంక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. 
 
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా, మంగళవారం నుంచి మరో రెండు హామీలను అమలు చేసేందుకు నడుంబిగించింది. ఇందుకోసం ఆహ్వాన పత్రికను కూడా ముద్రించింది. రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, అర్హులైన ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను మంగళవారం నుంచి ప్రారంభించనున్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఆహ్వాన పత్రికను ముద్రించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి, విశిష్ట అతిథిగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలు హాజరవుతారు. 
 
ఈ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఫరా ఇంజనీరింగ్ కాలేజీలో జరుగనుందని ఆహ్వాన పత్రికలో ముద్రించారు. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆహ్వాన లేఖలను విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరించనున్నట్టు ఆ పత్రికలో పేర్కొంది. 
 
కాగా, ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలుచేసింది. ఈ పథకానికి అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ పథకం అమలుతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లు తమకు ఉపాధి పోయిందని వాపోతూ, వివిధ రకాలైన ఆందోళనలు చేస్తున్నారు. ఇపుడు మరో రెండు పథకాలను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'సంక్రాంతికి వస్తున్నాం' - 3 రోజుల్లోనే రూ.106 కోట్లు వసూళ్లు!!

సైఫ్ అలీఖాన్‌కు కత్తిపోట్లు: ప్రధాన నిందితుడు అరెస్ట్?

బక్కోడికి రజిని బండోడికి బాలయ్య - తమన్ డైలాగ్ వైరల్

గేమ్ చేంజర్ పైరసీ - ఏపీ లోక‌ల్ టీవీ అప్పల్రాజు అరెస్ట్

ఆకట్టుకున్న హరి హర వీరమల్లు పార్ట్-1 మాట వినాలి పాట విజువల్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments