Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణ సమాజం నియంతృత్వ ధోరణిని సహించదు : గవర్నర్ తమిళిసై

tamilisai

వరుణ్

, శుక్రవారం, 26 జనవరి 2024 (11:15 IST)
తెలంగాణ సమాజం ఎన్నటికీ నియంతృత్వ ధోరణిని సహించదని ఆ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. హైదరాబాద్ నగరంలోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కీలక ప్రసంసంగం చేశారు. మహోన్నతమైన మన రాజ్యాంగాన్ని రాజ్యాంగకర్తలు ఎంతో ముందు చూపుతో తయారు చేశారన్నారు. సంక్షేమంలో తమ ప్రభుత్వం కత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని చెప్పారు. విధ్యాంసానిగి గురైన వ్యవస్థల్ని పునర్మించుకుందామని పిలుపునిచ్చారు. 
 
'బడుగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాజ్యంగం మార్గదర్శకత్వంలో ముందుకెళ్లడం గర్వించదగ్గ విషయం. ఆ స్ఫూర్తికి భిన్నంగా పాలకులు ముందుకెళ్తే ప్రజలు ఊరుకోరు. గడిచిన పదేళ్లల్లో అలాగే వ్యవహరించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారానే రాష్ట్రం సాధించుకున్నాం. నియంతృత్వం ధోరణితో వెళ్లదాన్ని తెలంగాణ సమాజం సహించదు. ఎన్నికల్లో తీర్పు ద్వారా నియంతృత్వ ధోరణికి ప్రజలు చరమగీతం పాడి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అహంకారం, నియంతృత్వం చెల్లవని విస్పష్టమైన తీర్పు ఇచ్చారు.
 
విధ్వంసానికి గురైన వ్యవస్థలను పునర్నిర్మించుకుందాం. రాజ్యాంగ స్ఫూర్తితో పరిపాలిస్తేనే పేదవాడికి అభివృద్ధి ఫలాలు అందుతాయి. ఏకపక్ష నిర్ణయాలు, నియంత పోకడలు ప్రజాస్వామ్యానికి శోభనివ్వవు. అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు కొత్త ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రజల ముఖాల్లో ఆనందం చూడాలన్నదే లక్ష్యం. ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణ మొదలైంది. మహాలక్ష్మి కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. 
 
మిగతా గ్యారంటీలనూ అమలు చేస్తాం. గాడి తప్పిన వ్యవస్థలను సరిదిద్దుకుంటూ ముందెకెళుతున్నాం. అభివృద్ధి విషయంలో ప్రపంచంతో పోటీ పడేలా ప్రణాళికలు రచిస్తున్నాం. సంక్షేమంలో సరికొత్త అధ్యాయం లిఖించేలా కొత్త ప్రభుత్వ పాలన ఉంటుంది. యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పనపై దృష్టి పెడతాం. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన పూర్తి కాగానే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతాం. దీనిపై ఎలాంటి అపోహలకూ యువత లోనుకావొద్దు' అని గవర్నర్ తమిళిపై ప్రసంగించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజకీయ పార్టీని ప్రారంభించనున్న నటుడు కోలీవుడ్ విజయ్!