Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుంటే లేచి కూర్చొన్న మహిళ

Webdunia
సోమవారం, 3 జూన్ 2019 (14:36 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించే సంఘటన ఒకటి ఇటీవల చోటుచేసుకుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఓ మహిళ అపస్మారక స్థితిలోకి జారుకుంది. దీంతో ఆమె కన్నుమూసిందని భావించిన.. అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
మరికొన్ని క్షణాల్లో అంత్యక్రియలు పూర్తిచేయాల్సివుండగా ఆ మహిళ అందరికీ షాకిస్తూ ఉన్నట్టుండి లేచి కూర్చొంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులతో పాటు.. అంత్యక్రియలకు హాజరైనవారంతా వచ్చి షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లా సారంగపూర్ గ్రామంలో జరిగింది. 
 
ఈ గ్రామానికి చెందిన కనకమ్మ అనే మహిళ కొన్నేళ్ల నుంచి అనారోగ్య సమస్యతో బాధపడుతుండేది. దీంతో ఆమెకు అత్యవసర చికిత్స అందించడం కోసం కరీంనగర్‌లోని ఓ ఆసుపత్రికి కుటుంబసభ్యులు తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగానే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. 
 
ఇక చేసేది ఏమి లేక కుటుంబసభ్యులు ఆమె మృతదేహానికి అంత్యక్రియలు ఏర్పాటు చేశారు. అయితే అందరిని ఆశ్చర్యపరుస్తూ ఆమె లేచి కూర్చుంది. దీనికి ఆమె కుటుంబసభ్యులు ఒకింత షాక్‌కు గురయ్యారు. కాగా మెరుగైన చికిత్స కోసం ఆమెను జగిత్యాలలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments