Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి బొత్స సత్యనారాయణను బర్త్‌రఫ్‌ చేయాలి : పసుమర్తి అనురాధ

Webdunia
మంగళవారం, 26 నవంబరు 2019 (16:43 IST)
రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న స్పీకర్‌ మహిళలను అవమానించేలా మాట్లాడుతారా?  మంత్రులు, స్పీకర్‌ బూతులు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? అంటూ టీడీపీ అధికార ప్రతినిధి పసుమర్తి అనురాధ ప్రశ్నించారు. ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, సైబరాబాద్‌లా అమరావతిని నిర్మించాలని చంద్రబాబు నాయుడు సంకల్పించారు. 
 
రాజధానిలో 35 లక్షల మందికి శాశ్వత నివాసం, 20 లక్షల మందికి ఉపాధి కల్పించాలని భావించారు. రాజధాని నుండి వచ్చిన ఆదాయంతో 13 జిల్లాలు అభివృద్ధి జరుగుతుంది. రాజధానిపై వైసీపీ నేతలు నక్క పురాణం చెప్పారు. రాజధాని ముంపుకు గురవుతుందని, వరద వస్తుందని, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని, అవినీతి జరిగిందని రకరకాల ఆరోపణలు చేశారు. కానీ ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు. 
 
రాష్ట్రంలో మంత్రులు, స్పీకర్‌, ఎమ్మెల్యేలు మాట్లాడే మాటలు వింటుంటే.. ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టారా? లేక బూతుల మీడియం ప్రవేశపెట్టారా? అనే అనుమానం కలుగుతోంది. విద్యారుల్ని, నిరుద్యోగుల్ని ఒక మంత్రి కుక్కలతో పశువులు పోల్చారు. స్పీకర్‌ మహిళలను అవమానపరిచేలా మాట్లాడతారా? రాజ్యాంగబద్దమైన, బాధ్యతాయుతమైన స్సీకర్‌ ఇలాగేనా మాట్లాడేది.? అంటూ ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments