ముఖ్యమంత్రి ఓ సైకో అంటూ నారా లోకేష్ వ్యాఖ్యానించారు. వైఎస్ హయాంలో ఫ్యాక్షనిజం చూశామని.. జగన్ హయాంలో సైకోయిజం చూస్తున్నామని చెప్పారు. ప్రజాప్రతినిధులు చెప్పిన మాటలను కొంతమంది పోలీసులు వింటున్నారని ఆరోపించారు. దీంతో పోలీసులకు చెడ్డపేరు వస్తోందన్నారు.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులపై ఒత్తిడి చేశామా?, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని చెప్పారు. రైతు భరోసా ఎవరికిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. బెల్టు షాపులు రద్దు చేస్తామని చెప్పారు.. కానీ షాపులు మాత్రం మూతపడలేదని పేర్కొన్నారు. ఇసుక ఇంకా అందుబాటులోకి రాలేదన్నారు.
తప్పుడు కేసులకు టీడీపీ కార్యకర్త శ్రీనివాస్‌రావు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు ప్రత్తిపాడులో వైసీపీ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న టీడీపీ కార్యకర్త శ్రీనివాసరావు కుటుంబాన్ని నారా లోకేష్ పరామర్శించారు.
శ్రీనివాసరావు కుటుంబానికి రూ.3లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం ప్రతిపాడు సెంటర్‌లో టీడీపీ జెండాను ఆయన ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ. ఆంజనేయులు, ఎమ్మెల్యే మద్దాల గిరి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ పాల్గొన్నారు.