Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగుదేశం తెగతెంపులు.. అవిశ్వాసానికి 8 పార్టీల మద్దతు... దీదీ హర్షం

కేంద్రంలోని ఎన్డీయే కూటమితో తెలుగుదేశం పార్టీ తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించిన వెంటనే జాతీయ స్థాయిలో రాజకీయ కుదుపు ఏర్పడింది. టీడీపీ అవిశ్వాసానికి ఎనిమిది పార్టీలు మద్దతిస్తున్నట్లు ప్రకటించాయి.

Webdunia
శుక్రవారం, 16 మార్చి 2018 (13:31 IST)
కేంద్రంలోని ఎన్డీయే కూటమితో తెలుగుదేశం పార్టీ తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించిన వెంటనే జాతీయ స్థాయిలో రాజకీయ కుదుపు ఏర్పడింది. టీడీపీ అవిశ్వాసానికి ఎనిమిది పార్టీలు మద్దతిస్తున్నట్లు ప్రకటించాయి. సీపీఐ, సీపీఎం, సమాజ్ వాదీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, తృణమూల్, ఆప్, ఎంఐఎం పార్టీలు మోదీ సర్కారుపై అవిశ్వాసానికి సై అంటున్నాయి. ఇప్పటికే కేంద్రంతో తెగతెంపులు చేసుకోవాలనే తెలుగుదేశం పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పశ్చిమ్‌బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు.
 
ఎన్డీయే నుంచి వైదొలగాలని తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని.. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులను చూస్తుంటే.. విపత్తు నుంచే దేశాన్ని రక్షించేందుకు తీసుకుంటున్న చర్యలను తలపిస్తున్నాయని.. ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత్వం, ప్రభుత్వ దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఏకం కావాలని మమత పిలుపునిచ్చారు. 
 
ఇకపోతే.. ఎన్డీయే నుంచి వైదొలగాలని తెలుదేశం పార్టీ అత్యున్నత స్థాయి నిర్ణాయక పొలిట్‌బ్యూర్‌ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షాకు తెదేపా లేఖ రాయనుంది. కూటమి నుంచి ఎందుకు విడిపోతున్నామనే వివరాలను లేఖలో స్పష్టం చేయనుంది. అంతేగాకుండా.. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నోటీసులు కూడా ఇవ్వాలని తెదేపా పొలిట్‌బ్యూర్‌ నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments