Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటర్లను ఫూల్ చేయడానికే సీఎం బాబు నాటకం... జర్నలిస్ట్ గోస్వామి... నెటిజన్లు ఏమంటున్నారంటే?

ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో జరుగుతున్న ఆందోళన తెలిసిందే. కొద్దిసేపటి క్రితం సభ్యుల నినాదాలతో లోక్ సభ సోమవారానికి వాయిదా పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోదీ ప్రభుత్వంపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం

Webdunia
శుక్రవారం, 16 మార్చి 2018 (13:09 IST)
ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో జరుగుతున్న ఆందోళన తెలిసిందే. కొద్దిసేపటి క్రితం సభ్యుల నినాదాలతో లోక్ సభ సోమవారానికి వాయిదా పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోదీ ప్రభుత్వంపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం తమకు అందిందని లోక్ సభ స్పీకర్ తెలియజేశారు. ఐతే సభ అదుపులో లేనందున దానిపై చర్చ చేపట్టే అవకాశం లేదని వెల్లడించారు. 
 
ఇదిలావుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకు రావడం, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని చెప్పడం అంతా చీప్ పోలిటిక్స్ అంటూ ప్రముఖ పాత్రికేయుడు అర్నాబ్ గోస్వామి ట్విట్టర్లో ప్రస్తావించారు. ఓటర్లను ఫూల్స్ చేసేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మార్గాన్ని ఎంచుకున్నారంటూ విమర్శించారు. ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తే మిగిలిన రాష్ట్రాలు కూడా అదే డిమాండ్ చేస్తే ఏం చేస్తారూ అంటూ ప్రశ్నించారు. దీనిపై నెటిజన్లు తమతమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
 
రాష్ట్రాన్ని విభజించేటపుడు కేంద్రానికి ఈ విషయం తెలియదా... ఒకవేళ ఇలాంటిది జరుగుతుందని తెలిసినప్పుడు రాష్ట్రాన్ని ఎందుకు విభజించారు అంటూ ప్రశ్నించారు. 2014 ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఎందుకు చెప్పారు...? అని ప్రశ్నిస్తూనే... నువ్వేమైనా భాజపా పెయిడ్ జర్నలిస్టువా అంటూ ప్రశ్నించారు. మొత్తమ్మీద అర్నాబ్ గోస్వామి చేసిన ట్వీట్ పైన నెటిజన్లు మండిపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments